వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగ్గారెడ్డి ఔదార్యం.!కరోనా పేషెంట్ల కోసం ఉచిత రవాణా.! 3 ఆంబులెన్సులను సమకూర్చిన ఎమ్మెల్యే.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ఆంబులెన్సులను పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం గాంధీ భవన్ లో హెల్ప్ డెస్క్ నంబర్ ను కూడా ఏర్పాటుచేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆంబులెన్స్ లు అందుబాటులో లేని వారు, ప్రయివేట్ ఆంబులెన్స్ ల ఆర్థిక భారం మోయలేని వారు 040-24601254 కి కాల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటే చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని జగ్గారెడ్డి తెలిపారు.

Recommended Video

Covid 19 బాధితుల కోసం MLA Jaggareddy అవిశ్రాంత సేవ!!
 ప్రజల ప్రాణాలతో చెలగాటం బాధ్యతారాహిత్యం కాదా.. సూటిగా ప్రశ్నించిన ఉత్తమ్..

ప్రజల ప్రాణాలతో చెలగాటం బాధ్యతారాహిత్యం కాదా.. సూటిగా ప్రశ్నించిన ఉత్తమ్..

ప్రైవేట్ ఆసుపత్రుల ధరల నియంత్రణ లేకపోడం శోచనీయమని, క్షేత్ర స్థాయిలో సరైన రీతిలో తనిఖీలు కూడా లేకవోవడం శోచనీయమని పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండి పడ్డారు. ప్రయివేట్ ఆసుపత్రుల దోపీడి పట్ల సీఎం కఠినంగా ఉంటామని ప్రకటించిన తర్వాత కూడా ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కరోనా వైద్యం ఆరోగ్యం శ్రీ లో చేర్చాలని, ఏపీ, మహారాష్ట్రలో కరోనా వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తున్నారని, తెలంగాణలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అర్దం కావడం లేదని ఉత్తమ్ విస్మయాన్ని వ్యక్తం చేసారు. టెస్టుల విషయం లో ప్రభుత్వం కోర్టు ఆదేశాలు కూడా పాటించడం లేదని, కరోనా కేసులు కృత్రిమ సంఖ్య చూపిస్తుందని, ఇది ఎప్పటికైనా ప్రమాదఘంటికలు మోగిస్తాయని అన్నారు.

 ప్రజల ప్రాణాలు ముఖ్యమని గుర్తించని నాయకత్వం దేనికి.? నిలదీసిన పొన్నాల

ప్రజల ప్రాణాలు ముఖ్యమని గుర్తించని నాయకత్వం దేనికి.? నిలదీసిన పొన్నాల

కాగా కరోనా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కాని చూస్తామని అనుకోలేదన్నారు పొన్నాల. ప్రధాని మోడీ, సీఎం చంద్రవేఖర్ రావు కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమయ్యారని, మోడీ రాష్ట్రాల మీద బాధ్యత వదిలి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కి కరోనా సెకండ్ వేవ్ విషయంలో ముందు చూపు లేకుండా వ్యవహరించాయని, గ్రామాల్లో సరైన టెస్టులు చేయకపోడంతో దుర్బర పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని గుర్తించని నాయకత్వం దేనికని పొన్నాల ప్రశ్నించారు.

 అలర్ట్ గా ఉండాలని హెచ్చరించిన సోనియా గాంధీ.. పంటించుకోని కేద్రం అన్న కాంగ్రెస్..

అలర్ట్ గా ఉండాలని హెచ్చరించిన సోనియా గాంధీ.. పంటించుకోని కేద్రం అన్న కాంగ్రెస్..

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 2020 ఫిబ్రవరి నుండి కరోనా వైరస్ పై హెచ్చరికలు చేస్తూనే వస్తున్నారని, కాంగ్రెస్ సలహాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని జగ్గారెడ్డి లన్నారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువగా ఉందని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నియంత్రించే కార్యక్రమం చేపట్టడం లేదని మండిపడ్డారు. 2020 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తే, 2021 ఏప్రిల్ 11 వరకు టాస్క్ ఫోర్స్ సమావేశం జరగలేదని విమర్శించారు జగ్గారెడ్డి. పార్లమెంటరీ కమిటీలు 2020 సెప్టెంబర్ లో ఆక్సిజన్ గురించి ముందుగా హెచ్చరించాయని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.

 ప్రజల సంక్షేమం కోసంమే కాంగ్రెస్ పనిచేస్తుంది.. అందుకే ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం అంటున్న టీపిసిసి..

ప్రజల సంక్షేమం కోసంమే కాంగ్రెస్ పనిచేస్తుంది.. అందుకే ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం అంటున్న టీపిసిసి..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో ప్రజల ప్రాణాల కంటే మరొకటి లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఉపాధి హామీ పథకం నూట యాభై శాతం అధికంగా ఉపయోగించుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలంగాణ కాంగ్రెస్ అభిప్రాయపడింది. 39 మంది డాక్టర్లు ఒక న్యాయవాది ఈ ప్రభుత్వానికి సూచనలు చేశారని, అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని టీపిసిసి మండిపడుతోంది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుంది కాబట్టి ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం కల్పించిందని టీ కాంగ్రెస్ స్పష్టం చేసింది.

English summary
Sangareddy Congress MLA Thurpu Jayaprakash Reddy said that as per the AICC directives, three ambulances were provided for the convenience of corona patients at the instigation of PCC chief Uttam Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X