నయిం అనుచరులకు జైల్లో సౌకర్యాలు, లంచం తీసుకొని సౌకర్యాలు కల్పించిన జైలర్

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్ :వరంగల్ జిల్లా జైల్లో మాజీ నక్సలైట్ నయిం అనుచరులు పాశం శ్రీనివాస్ కు సకల సౌకర్యాలు కల్పించారు జైలర్. అయితే వారికి భయపడి ఆయన వారికి సౌకర్యాలు కల్పించలేదు. ఇంట్లో ఉన్నట్టుగానే నయిం అనుచరులు జైల్లో గడిపారు. అయితే ఈ సౌకర్యాలు కల్పించేందుకు గాను వరంగల్ జైలర్ గోపిరెడ్డి 32 లక్షలు తీసుకొన్నాడని రాజభోగాలు అనుభవించిన వారే జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుతో అసలు విషయం వెలుగుచూసింది.

నయిం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వరంగల్ జైల్లో నిబంధనలకు విరుద్దంగాఅన్ని సౌకర్యాలు లభించాయి.జైల్లోంచే పాశం శ్రీనువాస్ సెల్ ఫోన్ ద్వారా పంచాయితీలు నిర్వహించాడు. సెల్ పోన్ లో స్నేహితులు, కుటుంబసభ్యులతో నిరంతరం మాట్లాడాడు. ఇంటి నుండి నిబంధనలకు విరుద్దంగా భోజనం తెప్పించుకొని తిన్నాడు.నిబంధనలకు విరుద్దంగా ములాఖత్ లను ఏర్పాటు చేశారు.ఈ మేరకు జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు ఆధారాలను సేకరించారు.

jailor provide facilities in jail to nayeem followers


వరంగల్ జిల్లా జైల్లో జైలర్ గా పనిచేస్తోన్న గోపిరెడ్డి పాశం శ్రీనివాస్ కు నిబంధలనకు విరుద్దంగా ఇన్ని సౌకర్యాలు కల్పించేందుకుగాను 32 లక్షలను లంచంగా తీసుకొన్నాడని తేలింది.పాశం శ్రీనివాస్ సన్నిహితుడైన నాగరాజు నుండి జైలర్ ఈ డబ్బులను తీసుకొన్నాడని జైళ్ళ శాఖ అధికారులు ఆధారాలను సేకరించారు.ఈ విషయాన్ని జైళ్ళ శాఖ డిజి వికె సింగ్ చెప్పారు.

వరంగల్ జైల్లో ఉన్న నయిం అనుచరులకు జైలు అధికారులు డబ్బులు తీసుకొని సౌకర్యాలు కల్పిస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు చెప్పారాయన.ఈ వివరాలను సిట్ కు కూడ అందిస్తామని ఆయన ప్రకటించారు.కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఖైదీలు జైలు నుండి తప్పించుకు పోవడానికి జైలర్ కారణమని ఆయన చెప్పారు.

లంచం ఇచ్చినవారే జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా జైలులో సూపరింటెండ్ సంపత్ జైలులో రౌండ్లు వేస్తోన్న సందర్భంలో పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్ లు కలిసి జైలర్ గోపిరెడ్డి తమ వద్ద 32 లక్షలను లంచంగా తీసుకొన్న విషయాన్ని వివరించారు.వారిద్దరూ ఈ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదును ఇచ్చారు.ఈ ఫిర్యాదును జైలు అధికారులు డిజికి పంపారు. జైలర్ గోపిరెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
nayeem followers pasham srinu and sandela sudhakar facilities permitted by jailor gopireddy, gopireddy taken 32 lakh rupees from pasham srinu , srinu complient jail officers this bribe issue on written. jails dg investigating also said this bribe issue.
Please Wait while comments are loading...