తెలంగాణ ఫిబ్రవరి 18నే వచ్చింది, యుద్ధ వాతావరణంలో: జైపాల్, 5 లక్షల మెజార్టీ: సర్వే
వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 జూన్ 2న కాదని, ఆ కల సాకారమైంది అదే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీనే మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సకల జనుల సమ్మెలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొనలేదని చెప్పారు. లోకసభలో యుద్ధ వాతావరణం మధ్య తెలంగాణ బిల్లు నెగ్గించామని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో కెసిఆర్ తెలంగాణ తీసుకు వచ్చేవారా అని చెప్పారు.

తెలంగాణ కల ఫిబ్రవరి 18నే సాకారమైందన్నారు. ఉప ఎన్నికల ద్వారా సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. తప్పుడు వాగ్దానాలతో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు.
5 లక్షల మెజార్టీతో గెలుస్తా: సర్వే సత్యనారాయణ
తన తుది శ్వాస వరకు తాను వరంగల్‌లోనే ఉంటానని మాజీ కేంద్రమంత్రి, వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. తాను వరంగల్ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications