తెలంగాణలో రేవంత్ మళ్లీ గెలుస్తారా.. తేల్చేసిన ప్రశాంత్ కిశోర్, శపథం..!!
తెలంగాణ రాజకీయాల పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ ఎన్నికల వేళ అక్కడ తల పడుతున్న రాజకీయ వ్యూహకర్త.. జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ఎన్నికల పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను రేవంత్ మూడు సార్లు కలిసిన విషయం బయట పెట్టిన ప్రశాంత్ కిశోర్.. తెలంగాణ లో భవిష్యత్ రాజకీయాల పైన తన అంచనాలను వెల్లడించారు. అదే సమయంలో రేవంత్ కు ప్రశాంత్ కిశోర్ చేసిన ఛాలెంజ్ బీహార్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలనంగా మారింది.
ప్రశాంత్ కిశోర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ తెలంగాణ సీఎం రేవంత్ గురించి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని శపథం చేసారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపాడలేరని చెప్పుకొచ్చారు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేసారు. అయితే, మళ్లీ ఇంకోసారి గెలవరని రేవంత్ ను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజల డీఎన్ఏ గురించి మాట్లాడిన రేవంత్ ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడు సార్లు ఎందుకు అడిగారని నిలదీసారు.

ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో శక్తి మేర పోరాటం చేస్తున్న ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతన్నాయి. దాదాపు మూడేళ్లుగా బీహార్ లో సొంత పార్టీతో బలం నిరూపించుకునేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారు. కాగా, తాజాగా చేసిన సర్వేల్లోనూ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 11 నుంచి 14 దక్కుతాయని తేలింది. 2023లో తెలంగాణ ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రశాంత్ కిశోర్ తొలుత కేసీఆర్ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగారు. ఆ తరువాత బీఆర్ఎస్ తో ఒప్పందం రద్దయింది.
ఆ సమయంలో కేసీఆర్ ప్రాజెక్టులను ప్రకాశ్ రాజ్ తో కలిసి సందర్శించారు. ఇక.. ఇప్పుడు బీహార్ లో తన పార్టీకి వచ్చే సీట్లు.. పాత్రకు అనుగుణంగా ప్రకాశ్ రాజ్ తన భవిష్యత్ ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, రేవంత్ మరోసారి గెలవరని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications