హరీశ్ కుట్రలు, అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు: జానా, కోమటిరెడ్డి హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాము నిర్వహించ తలపెట్టిన 'చలో అసెంబ్లీ'ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్కలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'చలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

హరీశ్ కుట్రలు

హరీశ్ కుట్రలు

ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. 'చలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'చలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

  Harish Rao Will Join Congress Party Before 2019 Elections | Oneindia Telugu
  సీఎం బయటికొస్తే కష్టాలు తెలుస్తాయి..

  సీఎం బయటికొస్తే కష్టాలు తెలుస్తాయి..

  ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలజడి సృష్టిస్తే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. రైతులకు బేడీలు వేసింది మీ ప్రభుత్వమేనని అన్నారు.

  జానా హెచ్చరిక

  జానా హెచ్చరిక

  'చలో అసెంబ్లీ' విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మండిపడ్డారు. 'చలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. తమను అడ్డుకుంటే మరో రకంగా ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు.

  బాబు వచ్చేలోపే టీడీపీ నాశనం, కేసీఆర్‌ నెత్తిన పాలు: రేవంత్ సంచలనం

  తీవ్ర ఉద్యమమే..

  తీవ్ర ఉద్యమమే..

  రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లేందుకే చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెప్పారు. నియంతృత్వ దోరణితో అణిచివేస్తే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

  ఆసక్తికరం: రేవంత్‌కి ఆలింగనంతో కాంగ్రెస్ నేతల స్వాగతం, టీడీపీకి దూరమేనా?

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leaders Jana Reddy and Komatireddy Venkat Reddy and Bhatti Vikramarka on Thursday fired at Telangana government for not giving permission to Chalo Assembly.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి