దేశం మొత్తం చుట్టుకుంటుంది, తలుచుకుంటే సాధ్యం: జానారెడ్డి హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu
  Delimitation of Assembly Seats in AP and Telangana | Oneindia Telugu

  హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన పైన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి గురువారం స్పందించారు. సీట్ల పెంపు విషయం పార్లమెంటుకు వెళ్తే అది దేశం మొత్తానికి చుట్టుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

  రేవంత్ రెడ్డి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం?

  ప్రస్తుత పరిస్థితుల్లో పునర్విభజన అసాధ్యం

  ప్రస్తుత పరిస్థితుల్లో పునర్విభజన అసాధ్యం

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన అసాధ్యమని జానారెడ్డి చెప్పారు. వివిధ కారణాలతో నియోజకవర్గాల పునర్విభజన జరిగే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  దేశం మొత్తానికి చుట్టుకుంటుంది

  దేశం మొత్తానికి చుట్టుకుంటుంది

  చట్టానికి లోబడి అసెంబ్లీ సీట్లను పెంచుకోవచ్చునని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని జానారెడ్డి చెప్పారు. పార్లమెంటులో సవరణ తెస్తే అది దేశం మొత్తానికి చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.

  తలుచుకుంటే సాధ్యమే

  తలుచుకుంటే సాధ్యమే

  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తలుచుకుంటే మాత్రం అవుతుందని జానా చెప్పారు. తాను అంచనాలను, జ్యోతిష్యాలను నమ్మనని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని చెప్పారు.

  బీజేపీలో ఆ దిశగా మార్పు

  బీజేపీలో ఆ దిశగా మార్పు

  కాగా, అసెంబ్లీ సీట్ల పెంపుకు బీజేపీ అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని చెప్పారు. అయితే తాజాగా మరో వాదన తెరపైకి వచ్చింది. రెండు వారాల్లో నిర్ణయం ఉండవచ్చునని, బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఉండవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి స్పందించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress Party Leader and Former Minister Jana Reddy talk about assembly consituencies increase.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి