ప్రజల వద్దకు వెళ్తాం: మూకుమ్మడి రాజీనామాలపై జానా సంకేతాలు, కేసీఆర్, హరీశ్‌పై నిప్పులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని, ప్రతిపక్షాన్ని మొత్తంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు తీవ్రమైన చర్య అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన అనంతరం జానారెడ్డి మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం మాట్లాడారు.

ఇది చీకటి రోజని, ప్రభుత్వం, స్పీకర్ అప్రజాస్వామిక నిర్ణయం తీసుకున్నారని జానారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తాను సభలో సంయమనం పాటిస్తూ వ్యవహరించినప్పటికీ తనను కూడా సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. సీసీ ఫుటేజీ చూస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు.

నిరూపించండి! రాజీనామా చేస్తా, ఆ 17ని. ఏం చేశారు?: కోమటిరెడ్డి సవాల్

 రాజ్యాంగ విరుద్ధం

రాజ్యాంగ విరుద్ధం

ప్రతిపక్ష నేత అయిన తనతోపాటు మండలి విపక్ష నేత షబ్బీర్ అలీని కూడా సస్పెండ్ చేయడం దారుణమని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వ తన ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాన్ని సభలో లేకుండా చేసిందని అన్నారు. సోమవారం సభలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోనిదని, గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సిందని జానారెడ్డి అన్నారు. సభ్యుల సంజాయిషీ కూడా తీసుకోకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని జానా రెడ్డి అన్నారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు కలగజేసుకోవాలని కోరారు.

  అసెంబ్లీలో కోమటిరెడ్డి వీరంగం, మండలి ఛైర్మన్ కంటికి గాయం
   రాజీనామాలపై సంకేతాలు?

  రాజీనామాలపై సంకేతాలు?

  ప్రతిపక్షాన్ని లేకుండా చేసి బడ్జెట్‌ను ఆమోదించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని జానారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రజల్లోకి వెళ్లి వారికి తెలియజేస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజా కోర్టులో తేల్చుకుంటామని జానా రెడ్డి అన్నారు. దీంతో జానారెడ్డి మూకుమ్మడి రాజీనామాలపై సంకేతాలిచ్చినట్లయింది. అంతేగాక, ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించాలని జానారెడ్డి పిలుపునిచ్చారు.

  ఇంకెన్నాళ్లీ గూండాగిరీ, చర్యలు తప్పవు: కోమటిరెడ్డికి తలసాని హెచ్చరిక, 24గంటల పర్యవేక్షణ

   అదేమైనా మిసైలా.. కేసీఆర్ చెప్పారని స్వామిగౌడ్..

  అదేమైనా మిసైలా.. కేసీఆర్ చెప్పారని స్వామిగౌడ్..

  ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్ అంటే తమకు గౌరవం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ చెబితేనే తాను సరోజనీదేవి ఆస్పత్రిలో చేరానని స్వామిగౌడ్ చెప్పారని తెలిపారు. ఛైర్మన్‌పై తమ సభ్యులు దాడి చేశారని చెప్పడం సరికాదని, తమ సభ్యులు ఎక్కడున్నారు.. ఛైర్మన్ ఎక్కుడున్నారని ప్రశ్నించారు. తమ సభ్యులు విసిరితే స్వామిగౌడ్‌కు హెడ్ ఫోన్ తగిలిందని అనడం సరికాదని, అదేమైనా మిసైలా.. దారులు మార్చుకుని వెళ్లడానికి? అని నిలదీశారు.

  మాది భగత్ సింగ్ పోరాటం-మీది ఉగ్రవాదం!: దాడిపై కాంగ్రెస్‌ను ఏకేసిన హరీశ్, ‘చర్యలు కఠినమే'

  అలాంటి హరీశ్.. ఇప్పుడిలానా?.. కేసీఆర్ డ్రామా ఇది

  అలాంటి హరీశ్.. ఇప్పుడిలానా?.. కేసీఆర్ డ్రామా ఇది

  హరీశ్ రావు గతంలో గవర్నర్‌ను అసల్ చేశారని, కానీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంయమనం పాటించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాంటి హరీశ్ ఈరోజు మోషన్ మూవ్ చేసి.. ప్రతిపక్షాన్ని గెంటేశారని మండిపడ్డారు. ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న ‘దాడి' డ్రామా అని అన్నారు. మీడియా కూడా ప్రభుత్వాలకు లొంగిపోతే ప్రజాస్వామ్యం తెలంగాణలో బతకదని ఉత్తమ్ అన్నారు. పార్టీ మారాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని కేసీఆర్ పై ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ఏ అసెంబ్లీలోనూ జరగని పరిణామం కేసీఆర్ ఆధ్వర్యంలో చోటు చేసుకుందని ఉత్తమ్ అన్నారు.

   కవిత పార్లమెంటులో చేస్తోంది కదా?

  కవిత పార్లమెంటులో చేస్తోంది కదా?

  స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని ఉత్తమ్ చెప్పారు. పార్లమెంటులో ఈరోజు కూడా కేసీఆర్ బిడ్డ కవిత, టీఆర్ఎస్ ఎంపీలో పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. అసెంబ్లీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఇలాంటి చర్యల కంటే.. అసెంబ్లీని ప్రగతి భవన్ లేదా టీఆర్ఎస్ భవన్ కు తరలించుకోవాలని కేసీఆర్‌కు చురకలంటించారు.

  దెబ్బ తగిలిన వీడియో ఏది? ఎందుకు చూపడం లేదు?

  దెబ్బ తగిలిన వీడియో ఏది? ఎందుకు చూపడం లేదు?

  స్వామిగౌడ్‌కు దెబ్బ తగిలిన వీడియో ఏది? ఎందుకు చూపడం లేదు? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం 17నిమిషాలు కొనసాగిందని, అప్పటి వరకు స్వామిగౌడ్ బాగానే ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందని ఉత్తమ్ ప్రశ్నించారు. నాలుగేళ్ల దోపిడీ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అసెంబ్లీలో పోలీసులను బెట్టి తమను నూశారని, తమపై దాడి జరిగిందని ఉత్తమ్ అన్నారు. రామ్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డిని తోసేశారని తెలిపారు. అసలు సభ్యుల సభ్యత్వాలు రద్దు చేసే అధికారం స్పీకర్ కు ఉన్నదా? అని ప్రశ్నించారు. స్పీకర్ స్థాన ప్రతిష్టను అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు.

  స్పీకర్ ఇలానా?.. ఇలాంటి రోజు చూస్తామనుకోలేదు..

  స్పీకర్ ఇలానా?.. ఇలాంటి రోజు చూస్తామనుకోలేదు..

  ఎన్నికల్లో ఎవరు గెలిస్తే.. వారు ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి అసెంబ్లీని నడిపించాలా? అని నిలదీశారు. మంగళవారం సస్పెన్షన్ కు ముందు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన జానారెడ్డి, తనకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కు అవకాశమిచ్చి తమను తిట్టించారని స్పీకర్ పై ఉత్తమ్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే చర్యలు తీసుకోని.. స్పీకర్, సోమవరం జరిగిన ఘటనలో ప్రతిపక్ష సభ్యులందర్నీ సస్పెండ్ చేయడమేంటని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇలాంటి రోజు చూస్తామని తాము అనుకోలేదని అన్నారు.

  అవమానించారు.. ఎన్నికల్లోనే తేల్చుకుంటాం

  అవమానించారు.. ఎన్నికల్లోనే తేల్చుకుంటాం

  ఉద్యోగాలు, మూడేకరాల భూమి, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరు నిలదీస్తారని.. తాము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే అసెంబ్లీకి వచ్చామని ఉత్తమ్ అన్నారు. పోలీసులను బెట్టి తమను సభలో అవమానపర్చారని అన్నారు.

  సభలో జరిగిన ఘటనను స్పీకర్.. దుర్మార్గపు ఘటన అని ఎలా అంటారని ఉత్తమ్ ప్రశ్నించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. అసెంబ్లీ పరిణామంతో తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం అవమానించినట్లేనని ఉత్తమ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. అధికారంలోకి వస్తామని ఉత్తమ్ చెప్పారు.

   కేసీఆర్ కుట్రపూరితంగా..

  కేసీఆర్ కుట్రపూరితంగా..

  మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభలో మెజార్టీ ఉందని బడ్జెట్ పై చర్చ జరగకుండానే ఆమోదించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రమాదకరమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి తమను సస్పెండ్ చేసిందన్నారు. ఇలాంటి ఘటన దేశంలో మొట్టమొదటిది కావచ్చని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా నేచరల్ జస్టిస్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ నడుచుకోలేదని ఆయన ఆరోపించారు. సభ్యుల సంజాయిషీ తీసుకోకుండానే చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. గవర్నర్ సమక్షంలో జరిగిన ఘటనపై ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మరో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress MLAs Jana Reddy and Uttam Kumar Reddy on Tuesday fired at Telangana CM K Chandrasekhar Rao and Harish Rao for assembly issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి