కేసీఆర్ రైతురాజ్యం అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.!3వ ప్లీనరీని విజయవంతం చేయాలన్ని కోదండరాం.!
హైదరాబాద్ : తెలంగాణ బచావో అనే నినాదాన్ని మరొక్కసారి బుజాన వేసుకున్నారు టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్. జూన్ 4న సూర్యాపేటలో జరగబోయే తెలంగాణ జన సమితి 3వ ప్లీనరీ పోస్టర్ మరియు కరపత్రాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. జూన్ నాలుగవ తేదీన తెలంగాణ జన సమితి మూడవ ప్లీనరీ నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా రెండు ప్లీనరీలో జరుగుపుకొలేక పోయామన్నారు కోదండరాం.
ఉద్యమ కారుల ఆకాంక్షల కోసం పోరాటం నిర్వహించాలని, కృష్ణ జలాల కోసం పోరాటం చేశామని, ఢిల్లీలో కూడా మౌన దీక్ష నిర్వహించామన్నారు కోదండరాం. పేపర్ లీకేజి వ్యవహారం మీద పోరాటం చేశామని, రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెడుతామన్నారు.

సీఎం రైతు రాజ్యం కావాలి అని చెప్పటం దైయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోదండరాం డిమాండ్ చేసారు. నేటి పాలకులు నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఆ అంశాన్ని ముందే పసిగట్టారన్నారు.
పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులను కూడా సంఘటితం చేస్తామన్నారు. అందరం కోట్లాది తెలంగాణ సాధిస్తే, చంద్రశేఖర్ రావు, తన కుటుంబం పెంపుకోసం, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. పోరాటం కోసం అనుసరించ వలసిన వ్యూహాల మీద దృష్టి పెడుతామని, తెలంగాణ జన సమితి పార్టీ మూడవ ప్లీనరీ కి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానికాన్ని ప్రొ. కోదండరాం కోరారు.












Click it and Unblock the Notifications