వచ్చే ఎన్నికల్లో తెలంగాణ-ఏపీలలో పోటీపై స్పష్టతనిచ్చిన జనసేన
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన స్పష్టతనిచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పార్టీ ప్రతినిధులు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలలో తిరుగుతూ పార్టీ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తాము తమ కార్యకర్తలతో చర్చించామని అన్నారు.
లక్షలాది మంది యువత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నారన్నారు. ఆగస్టు నాటికి పార్టీ ప్రణాళిక సిద్ధమవుతుందని, అది సిద్ధమయ్యాకు పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరఫున మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలిపారు. జనసేన దశ, దిశ ఎలా ఉండబోతుందో వివరిస్తారన్నారు.
Recommended Video













Click it and Unblock the Notifications