వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన: టిఆర్ఎస్‌కు చెక్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో పర్యటించినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడ పవన్ కళ్యాణ్ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓయూలో ఆత్మహత్య చేసుకొన్న మురళి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో పవన్, జగన్ అభిమానుల తిట్ల యుద్దం, వెంకట్‌రెడ్డి అరెస్ట్, పోలీసుల నిఘాసోషల్ మీడియాలో పవన్, జగన్ అభిమానుల తిట్ల యుద్దం, వెంకట్‌రెడ్డి అరెస్ట్, పోలీసుల నిఘా

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఎన్నికల వాతావరణం అప్పుడే సమీపించినట్టుగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సన్నాహలు చేసుకొంటున్నాయి. అయితే ఈ తరుణంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నాటికి జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'

ఇటీవలనే ఏపీ రాష్ట్రంలో సుమారు నాలుగు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కూడ ఆ పార్టీ వ్యూహన్ని రచిస్తోంది.

జగన్‌కు షాక్: పోలవరంపై బిజెపి, టిడిపిల ఏకాభిప్రాయం, వైసీపీకి బాబు చెక్జగన్‌కు షాక్: పోలవరంపై బిజెపి, టిడిపిల ఏకాభిప్రాయం, వైసీపీకి బాబు చెక్

 తెలంగాణలో జనసేన విస్తరణ లక్ష్యం

తెలంగాణలో జనసేన విస్తరణ లక్ష్యం

తెలంగాణ రాష్ఠ్రంలో కూడ జనసేనను విస్తరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో కూడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు.. ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం అన్ని రకాల చర్యలను తీసుకొంటుంది.తెలంగాణలో ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం కూడ లేకపోలేదు. ఈ మేరకు ఏ అంశాలను తీసుకొని పనిచేయాలనే దానిపై పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

మురళి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

మురళి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

ఓయూలో ఆత్మహత్య చేసుకొన్న మురళి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ త్వరలోనే పరామర్శించే అవకాశాలున్నాయి.ఓయూలో జరిగిన మురళి ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మురళి కుటుంబాన్ని త్వరలోనే పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 తెలంగాణలో పవన్ పర్యటనకు ప్లాన్

తెలంగాణలో పవన్ పర్యటనకు ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఏపీ రాష్ట్రంలో పర్యటించిన తరహలోనే తెలంగాణలో కూడ పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జనసేన తెలంగాణ శాఖ ఏర్పాట్లను చేస్తోంది. ప్రజా సమస్యలను గుర్తించే పనిలో జనసేన తెలంగాణ శాఖ నిమగ్నమయింది. తెలంగాణలో వివిధ సమస్యలపై అంశాల వారీగా జనసేనాని పవన్‌ పోరాడనున్నారు.

 తెలంగాణలో అనుబంధ విభాగాల ఏర్పాటుకు పవన్ కసరత్తు

తెలంగాణలో అనుబంధ విభాగాల ఏర్పాటుకు పవన్ కసరత్తు

ఆంధ్రతో పాటు ఇప్పటికే తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. పార్టీ విద్యార్థి విభాగం , యువజన విద్యార్ధి విభాగం , యువజన విభాగం మహిళా వింగ్‌ల నియామకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో వీటిని అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో అధికారికంగా కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మాజీ పిఆర్‌పి నేతలపై జనసేన కన్ను

మాజీ పిఆర్‌పి నేతలపై జనసేన కన్ను

ఇతర పార్టీల్లో ఉన్న పాత యువరాజ్యం నాయకులను పవన్ తిరిగి జనసేనలోకి ఆహ్వనించాలని భావిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం, వైసీపీలలోని నాయకులు.. లోక్ సత్తా పార్టీ క్యాడర్‌ జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.గ్రేటర్ హైద్రాబాద్ , ఖమ్మం, ఉమ్మడి నిజమాబాద్ , ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో పార్టీ కార్యాలయానికి స్థలం అన్వేషణ

తెలంగాణలో పార్టీ కార్యాలయానికి స్థలం అన్వేషణ

తెలంగాణలో కూడా పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ స్ధలాన్ని అన్వేషిస్తోంది. హైద్రాబాద్లోని గచ్చిబౌలీ ప్రాంతంలో పార్టీ ఆఫీసుకు ఇప్పటికే స్థలాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.తెలంగాణలో కూడ పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
janasena chief Pawan Kalyan planning to strenthe party in Telangana state. Pawan Kalyan will visit Ou student Murali family members soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X