జనసేనకు 9 సీట్లు - బీజేపీ మూడో జాబితా సిద్దం, లిస్టులో..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేగంగా మారుతోంది. పార్టీలు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పొత్తు లో భాగంగా సీట్లు దాదాపు ఖరారయ్యాయి. కాంగ్రెస్ - వామపక్షాల పొత్తు వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తొలి సారిగా జనసేన తెలంగాణలో తమ బలం ఏంటో పరీక్షించుకుంటోంది. బీజేపీ మూడో జాబితా పైన కసరత్తు తుది దశకు చేరింది. ఈ జాబితాలో ఉండే అభ్యర్దులు ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.
జనసేనకు సీట్లు ఇవే: తెలంగాణలో బీజేపీ - జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. జనసేన ముందుగానే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ తరువాత బీజేపీ నేతలు పవన్ తో సమావేశం.. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ తరువాత సీట్ల ఖరారు పైన చర్చలు జరిగాయి. జనసేన తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరింది. కానీ, అంతిమంగా 9 సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవటం తో ఏపీకి చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలనేది బీజేపీ వ్యూహం.

ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయం కావటంతో అక్కడ మూలాలు ఉండి తెలంగాణలో స్థిర పడిన ఆ రెండు పార్టీల మద్దతు దారుల ఓట్లు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా జనసేనకు మొత్తం తొమ్మిది సీట్లు ఖరారు కాగా..అందులో కుకట్ పల్లి, మెదక్, తాండూరు, నాగర్ కర్నూల్, కోదాడ, అశ్వారావు పేట, వైరా తో పాటుగా గ్రేటర్ లో మరో రెండు సీట్లు..ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
బీజేపీ మూడో జాబితాలో: ఇక, బీజేపీ మూడో జాబితాలో ఆసిఫాబాద్ - తుకారాం, చెన్నూరు - అందుగుల శ్రీనివాస్, మంచిర్యాల -రఘనాధ బాబు, బాన్సువాడ - మాల్యాద్రిరెడ్డి, బోధన్ - మేడపాటి ప్రకాశ్ రెడ్డి /వడ్డి మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ - దినేశ్, ఎల్లారెడ్డి - పైలా క్రిష్ణారెడ్డి, మంధని - చందుపట్ల సునీల్ రెడ్డి, పెద్దపల్లి -గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి, వేముల వాడ - వికాస్ రావు / తుల ఉమ, జహీరాబాద్ - ఢిల్లీ వసంత్, సంగారెడ్డి- పులిమామిడి రాజు, నారాయణ ఖేడ్ - విజయపాల్ రెడ్డి, ఆందోల్ - బాబుమోహన్, హుస్నాబాద్ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి/జేఎస్ఆర్, సిద్దపేట - దూది శ్రీకాంత్ రెడ్డి, షాద్ నగర్ - శ్రీవర్ధన్ రెడ్డి / అందె బాబయ్య, ఎల్బీ నగర్ - సామా రంగారెడ్డి, రాజేంద్ర నగర్ - తోకల శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి - రవి కుమార్ యాదవ్, చేవెళ్ల - కేఎస్ రత్నం, వికారాబాద్ -తులసి విజయరాం, కొడంగల్ - చికోటి ప్రవీణ్, మేడ్చల్ - విక్రంరెడ్డి, సుదర్శన రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.
తుది కసరత్తు..నేడే ప్రకటన: వీటితో పాటుగా మల్కాజ్ గిరి - ఆకుల రాజేందర్, ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముషిరాబాద్ - పాపారావు/ బండారు విజయలక్ష్మి, మలక్ పేట- లింగాల హరిగౌడ్ / కొత్తకాపు రవీందర్ రెడ్డి, అంబర్ పేట - గౌతం రావు, జూబ్లీహిల్స్ - జాటూరి కీర్తిరెడ్డి, సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి, నాంపల్లి - విక్రమ్ గౌడ్, సికింద్రాబాద్ - బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్ - మాజీ మంత్రి శంకరరావు కుమార్తె సుస్మిత, జడ్చర్ల - చిత్తరంజన్ దాస్, దేవరకద్ర - పవన్ కుమార్ రెడ్డి,అచ్చంపేట -సతీశ్ మాదిగ, వనపర్తి -అశ్వథ్తామ రెడ్డి, గద్వాల - స్నిగ్ధారెడ్డి, నకరికేల్ - పాల్వాయి రజనీ, నల్గొండ - శ్రీనివాస గౌడ్, మునుగోడు - బూరా నర్సయ్య గౌడ్, దేవరకొండ -లాలూ నాయక్, మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్, మధిర - అజయ్ కుమార్,సత్తుపల్లి- శ్యాం నాయక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లేదా రేపు మూడో జాబితా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications