Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నను తప్పుబట్టిన తమ్ముడు.. : పార్టీని చక్కదిద్దే పనుల్లో 'జానారెడ్డి-రాజగోపాల్ రెడ్డి'

నల్గొండ : కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరే ప్రయత్నాల్లో మునిగిపోయారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో.. సీఎల్పీ లీడర్ జానారెడ్డి నల్గొండ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి, వలసలకు ఎలా బ్రేకులు వేయాలా అన్న అంశంపై చర్చించినట్టుగా సమాచారం.

ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలిని తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి సహా పార్టీ నేతలెవరైనా సరే కాంగ్రెస్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అలాగే పార్టీ మార్పుల గురించి స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురి చేయాలని చూడడం కేసీఆర్ పతనానికి నాంది పడడం కింద లెక్కే అని తెలిపారు.

నాపై చర్యలు ఈజీ కాదు, జానారెడ్డిని పనికిరారని తిట్టారుగా: కోమటిరెడ్డి

అంతర్గత గ్రూపు తగాదాలు, బలహీనంగా ఉన్న అభ్యర్థుల వల్లే ఎంపీగా ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చిన ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారాలనుకునేవారు ఒక్కసారి పునరాలోచించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అని ఆశాభావం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ ని అధికార పక్షం టార్గెట్ చేయడం సరైందని కాదని హితవు పలికారు.

 Janreddy-Rajagopal get together protect congress

కాగా, సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీలో భాగంగా.. జిల్లా రాజకీయాల గురించి లోతుగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్య నేతలు పార్టీని వీడే పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తిరిగి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

జిల్లాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి భవిష్యత్తులో జిల్లా పార్టీ బాధ్యతలను ఇద్దరు కలిసి పర్యవేక్షించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ విషయాలన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడానికి త్వరలోనే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లనట్టుగా సమాచారం. చూడాలి మరి, జానారెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు వలసలకు బ్రేక్ వేసి, పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడుతాయో..!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+