హైదరాబాద్ ఆస్తులు: జయలలితను వైఎస్ చిక్కుల్లో పడేశారా?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాదులో ఆస్తులున్నాయి. వాటికి ఆమె వీలునామాలు గానీ, వాటీకి వారసులు గానీ తెలుస్తోంది. వైఎస్ ఆమెను చిక్కుల్లో పడేశారా..
హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సినీ రంగంలో వెలిగిపోతున్నప్పుడు క్రమం తప్పకుండా హైదరాబాద్ వచ్చేవారు. 1999 వరకు ఆమె హైదరాబాద్ వచ్చి ఆస్తులను చూసుకునేవారు. తమిళనాడు శానససభ ఎన్నికల్లో 1996లో ఓడిపోయిప్పుడు ఎక్కువ కాలం హైదరాబాదులోనే ఉండేవారు. పార్టీ నాయకులకు గానీ, అభిమానులకు గానీ ఆమె అందుబాటులో ఉండేవారు కాదని అంటారు.
ఇదిలావుంటే, జయలలిత హైదరాబాదు ఆస్తులకు వీలునామా రాయలేదని, వాటికి వారసులు కూడా లేరని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెకు హైదరాబాదులో రెండు వ్యవసాయ క్షేత్రాలు, ఓ వాణిజ్య సముదాయం ఉన్నాయి. వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం 50 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
ఆమె, ఆమె తల్లి సంధ్య అలియాస్ వేదవల్లి 2.28 లక్షల రూపాయలకు హైదరాబాదులో ఆస్తులు కొన్నారు. జయలలిత 2015 ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వాటి వీలువు 19.48 కోట్ల రూపాయలుగా చూపించారు.

మారేడుపల్లిలోని భవనం సైతం...
సికింద్రాబాదులోని మారేడుపల్లిలో గల నివాస భవనం కూడా జయలలితకు చెందిందనే చెబుతారు. దాన్ని ఆమె అఫిడవిట్‌లో చూపించలేదు. అయితే, అది ఆమె ఇంటిగానే గుర్తింపు పొందింది. సినీరంగంలో బిజీగా ఉన్న కాలంలో జయలలిత హైదరాబాదు నగర శివారులోని మేడ్చెల్‌లో ఓ ద్రాక్ష తోటను కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాని పక్కన ఉన్న 3.4 ఎకరాల భూమిని 20 వేల రూపాయలకు కొన్నారు.

శ్రీనగర్‌లో వాణిజ్య సముదాయాన్ని కొన్నారు...
జయలలిత ఆమె తల్లి కలిసి హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఓ వాణిజ్య సముదాయాన్ని కొనుగోలు చేశారు. సంపన్న వర్గాలు నివసించే బంజారాహిల్స్‌కు ఇది సమీపంలో ఉంటుంది. దాని విస్తీర్ణం 14 వేల చదరపు అడుగులు. దాన్ని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1967లో మారేడుపల్లిలో రాధికా కాలనీలో ఆమెకు ఓ ఇల్లు ఉండేది.

వైయఎస్ హయాంలో కష్టాలు..
జయలలితను వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం 2004 నుంచి చిక్కుల్లో పడేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఆమె హైదరాబాదుకు రావడం మానేశారంటున్నారు. మేడ్చేల్‌లోని ఫామ్‌హౌస్‌కు చెందిన 8 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపిస్తూ వైఎస్ ప్రభుత్వం తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ భూమి అసైన్డ్ ల్యాండ్ అని ప్రభుత్వం తెలుపుతూ ఆ నోటీసులు ఇచ్చింది.

సెలవుల్లో కూడా హైదరాబాద్‌కు దూరమే..
జయలలిత 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాదుకు దూరంగానే ఉన్నారు. సెలవులకు హైదరాబాద్ వచ్చే ఆమె పూర్తిగా ఇక్కడికి రావడమే మానేశారు. ఆమె ఊటీకి, కోడైకెనాల్ వెళ్తుండేవారు. మేడ్చేల్‌లోని ఫామ్‌హౌస్‌ను ముగ్గురు రైతులకు కౌలుకు ఇచ్చారు. భవనం మాత్రం తాళం వేసే ఉంటోంది. ఫామ్ హౌస్‌తో పాటు శ్రీనగర్ కాలనీ సముదాయానికి ఆస్తి పన్ను కట్టాల్సి ఉందని అంటున్నారు. అది కొన్ని లక్షల్లో ఉంటుందని సమాచారం. జయలలిత మరణం తర్వాత హైదరాబాదులోని ఆస్తులకు భద్రతను పెంచారు.












Click it and Unblock the Notifications