జేబీఎస్: టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్గొండ నుంచి జేబీఎస్‌కు వచ్చింది.
బస్సును స్టేషన్‌లో నిలిపేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న గణేష్ టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టిఫిన్ మాస్టర్ రాజన్‌తో పాటు హోటల్‌లో భోజనం చేస్తున్న నిజామాబాద్‌కు చెందిన ప్రయాణికుడు కన్నయ్య తీవ్రగాయాలపాలయ్యారు.

పోలీసులు, స్థానికులు వారిని వెంటనే 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మారేడు పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్లీనర్ హరితో బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications