ఫామ్‌హౌస్ భూమి ఎకరా 10 లక్షలకు ఇస్తారా: కెసిఆర్‌ను అడిగిన జీవన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన ఫామ్ హౌస్ భూమిని ఎకరాకు రూ.10 లక్షలకు ఇస్తారా అని కాంగ్రెసు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి అడిగారు. హైదరాబాదులో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు
నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను తాము అడుగుతున్నట్లు మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ద్వారా నిర్వాసితులకు న్యాయం జరగదని, ఆ జీవోలో నష్టపరిహారమూ పునరావాసానికి సంబంధించిన అంశాలు లేవని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేసి భూనిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. భూనిర్వాసితులకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం రూ.10 లక్షలే ఇస్తామని చెప్పడం అన్యాయమని ఆయన అన్నారు
జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి, భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే విధానాన్ని ఖరారు చేయాలని ఆయన కెసిఆర్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications