వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం అసహనంగా వ్యవహరిస్తోంది: సభలో జితేందర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అసహనంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. లోకసభ సమావేశాల్లో అసహనంపై చర్చలో భాగంగా ఎంపి మాట్లాడుతూ.. తెలంగాణలో హిందూ-ముస్లింలు సామరస్యంగా ఉంటారని అన్నారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలను సత్వరమే కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్య లేకుండా చేశారని చెప్పారు.

Jithender Reddy fires at Centre

అఖిల భారత అధికారుల పంపిణీలో, కేటాయింపులో, రాష్ర్టాలకు ఇచ్చిన ఇళ్ల కోటా కేటాయింపులోనైతేనేమి ఇలా పలు అంశాల్లో తెలంగాణ విషయంలో కేంద్రం అసహనంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా, దేశంలో అసహనం పెరిగిపోతుందన్న ఆరోపణలతో వామపక్ష పార్టీలు మంగళవారం లోకసభ ఆవరణలో నిరసన చేపట్టాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి రాజాలతో పాటు ప్రముఖ లెఫ్ట్ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.

English summary
TRS MP Jithender Reddy on Tuesday fired at Centre government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X