• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జోగినపల్లి సంతోష్ బర్త్ డే ప్రత్యేకత.!గ్రీన్ ఇండియా చాలెంజ్ ఖండాంతరాలకు వ్యాపించిందన్న మంత్రులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అడవులు హరించి పోవడంతో భూగోళం విపత్తులో పడిందనన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుర్తించాడని, అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా 221 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా హరితహరాన్ని ప్రారంభించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు జోగినేపల్లి సంతోష్ కుమార్ కు వినూత్న బాద్యతలు అప్పగించారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేసారు.

హరిత ప్రేమికుడి జన్మదినం..

హరిత ప్రేమికుడి జన్మదినం..

రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా సృష్టికర్త జోగినేపల్లి సంతోష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. టియస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లతో పాటు గ్రీన్ ఇండియా కో ఆర్డినేటర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. మానవజాతి మనుగడకు పర్యావరణం సవాల్ విసురుతున్న నేపధ్యంలో అటువంటి హాని నుండి బయట పడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ప్రారంభించారన్నారు.

జోగినేపల్లి సంతోష్ కుమార్ జన్మదినం ప్రత్యేకత..

జోగినేపల్లి సంతోష్ కుమార్ జన్మదినం ప్రత్యేకత..

అంతటి దూర దృష్టి ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్ఫూర్తితో, ఆయనను అత్యంత సమీపంగా చూసిన నేతగా సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించారన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఖండాంతరాలకు వ్యాపించిందని అందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చూపిన చొరవనే కారణమని జగదీష్ రెడ్డి చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమాన్ని అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో, జరిగిన అభివృద్ధిని మలచి దృశ్యాన్ని, శ్రావ్యాన్ని కలిపి చక్కటి గీతంగా మలచి సిడి రూపంలో వినసొంపుగా రూపొందించారని జగదీష్ రెడ్డి నిర్వాహకులను అభినందించారు.

కేసీఆర్ మనసు ఎరిగిన నేత..

కేసీఆర్ మనసు ఎరిగిన నేత..

రాష్ట్ర ఎక్సయిజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొక్కల పెంపకం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వప్నం అని, అది నిజం చేసేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపంలో ముందుకు సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ టీం ను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్ఫూర్తి తో మహబూబ్నగర్ జిల్లాలో సీడ్ బౌల్స్ తో జరిగిన హరిత ఉద్యమం గిన్నిస్ రికార్డ్ లో నమోదయ్యిందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖా కమిషనర్ మామిడి హరికృష్ణ వ్యాఖ్యాత గా వ్యవహరించారు.

హరిత ప్రేమికుడు..

హరిత ప్రేమికుడు..

హరిత ప్రేమికుడు, మొక్కలంటే అమితమైన మక్కువ చూపే నేత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఖండంతారాలకు తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పచ్చదనం గొప్పదనాన్ని చాటుతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేమం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా శక్తినివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హరితహారాన్ని స్పూర్తిగా తీసుకుని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంపై సంతోష్ కుమార్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి సత్యవతి.

English summary
Minister Jagadish Reddy clarified that CM Chandrasekhar Rao has handed over innovative responsibilities to Joginepally Santosh Kumar to make the state and the country greener.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X