బీఈడీ సర్టిఫికెట్ విక్రయిస్తా: 35% మార్కులొస్తే కలెక్టర్ కావొచ్చు, ఇదేక్కడి న్యాయం?: ఆశోక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల కారణంగా టీచర్ ఉద్యోగం వస్తోందనే ఆశ సన్నగిల్లడంతో జోగుపర్తి ఆశోక్ అనే యువకుడు తన బిఈడీ సర్టిఫికెట్‌ను విక్రయిస్తాననంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెలువడుతున్న ఈ తరుణంలో జోగుపర్తి ఆశోక్ ఈ రకంగా తన సర్టిఫికెట్‌ను విక్రయిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల కారణంగా ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆశోక్ ఈ రకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని అంటున్నారు.

బీఈడీ సర్టిఫికెట్ విక్రయిస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్

బీఈడీ సర్టిఫికెట్ విక్రయిస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్

నల్గొండ జిల్లాకు చెందిన జోగుపర్తి ఆశోక్ అనే యువకుడు తన బీఈడీ సర్టిఫికెట్‌ను విక్రయిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ సర్టిఫికెట్‌ను ఎవరైనా కొంటే.. వచ్చిన డబ్బును పూర్తిగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తానని ప్రకటించాడు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌పై జోరుగా చర్చ సాగుతోంది అసలు ఆశోక్ ఎందుకు తన సర్టిపికెట్‌ను విక్రయిస్తానని అంటున్నాడనే దానిపై ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు.

ఆశోక్‌కు అడ్డంకిగా మారిన నిబంధనలు

ఆశోక్‌కు అడ్డంకిగా మారిన నిబంధనలు

జోగుపర్తి ఆశోక్ బీఎడ్‌ పూర్తిచేశాడు. రెండుసార్లు టెట్‌ కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించినవారికే టీఆర్టీలో అవకాశం అంటూ నిబంధనను ప్రవేశపెట్టడం అశోక్‌ కలలను కల్లలు చేసింది.2008లో డిగ్రీ, 2009లో బీఎడ్‌ పూర్తిచేశాడు అశోక్‌. అయితే, అతడికి డిగ్రీలో 48.25శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు టీఆర్టీకి అనర్హుడయ్యాడు.

50 శాతం మార్కుల నిబంధనతో

50 శాతం మార్కుల నిబంధనతో

అప్పట్లోనే బీఎడ్‌లో చేరడానికి 50శాతం మార్కుల నిబంధనను పెట్టి ఉంటే నేను బీఎడ్‌లో చేరకుండా ఇతర కోర్సు ఏదైనా చేసుకునేవాడిని కదా? అని అశోక్‌ అభిప్రాయపడుతున్నాడు. డిగ్రీలో 50 శాతం మార్కులనే నిబంధన ఆశోక్‌కు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుపడింది.

టెట్‌లో 72 శాతం మార్కులు

టెట్‌లో 72 శాతం మార్కులు

బీఎడ్‌ చేసిన తర్వాత కొత్తగా టెట్‌ అంటూ మరో మెలిక పెట్టారు. . అందులో 60శాతం మార్కులను సాధిస్తేనే డీఎస్సీకి అర్హత అని ప్రభుత్వం ప్రకటించింది.. నేను 72శాతం మార్కులు తెచ్చుకున్నా. 2012లో డీఎస్సీ కూడా రాసిన విషయాన్ని ఆశోక్ ఫేస్‌బుక్ పోస్టులో ప్రస్తావించారు.నేను ఇప్పుడు టీఆర్టీకి అర్హుడను కాకుండా పోయాను ఇదేం న్యాయమని ఆశోక్ ప్రశ్నించారు.

36శాతం మార్కులతో కలెక్టర్ కావొచ్చు

36శాతం మార్కులతో కలెక్టర్ కావొచ్చు

36శాతం మార్కులు సాధించినా కలెక్టర్‌ కావొచ్చు.. గ్రూప్‌ 1, 2 ఉద్యోగులు కావొచ్చు. పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌లో 75శాతం మార్కులు సాధించిన నాకు టీఆర్టీ రాసే అర్హత లేదా అని ఆశోక్ ఫేస్‌బుక్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏపీలో మాత్రం మార్కుల శాతంతో నిమిత్తం లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తోందన్నారు.

టెట్‌కు నిబంధనలివే

టెట్‌కు నిబంధనలివే

టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఎస్‌జీటీ పరీక్షకు పోటీ పడే వారు ఇంటర్‌లో 50శాతం మార్కులు సాధించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు సాధించాలి. అయితే నోటిఫికేషన్‌ జారీ కంటే ముందు ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారికి 45ు మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది.దీన్ని విస్మరించిన అధికారులు నోటిఫికేషన్‌లో ఎలాంటి వ్యవధిని పేర్కొనకుండా అందరికీ వర్తించేలా నిబంధనలు రూపొందించింది. దీంతో 2010 కన్నా ముందు డిగ్రీ పూర్తి చేసి 45శాతం మార్కులు సాధించిన వారు ఇప్పుడు టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు అనర్హులుగా మారారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
J. Ashok to sale his BED certificate. He is not qualify for TRT. Telangana government introduced new rule for TRT.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి