పార్టీలో చేరికలు..ఆర్థిక సాయం.!కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలి.!టీ సర్కార్ కు జగ్గారెడ్డి హెచ్చరిక
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయని, కొనుగోలు అంశంలో రెండు ప్రభుత్వాలు ఒకరిపై మరోక ప్రభుత్వం నెపం మోపుకుని రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నాయని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వమెత్తారు. రెండు నెలల నుండి రైతులకు గొనె సంచులు, ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రైతు రాములు గుండె పోటుతో చనిపోవడం బాధాకరమని, 6నెలలు కష్ట పడి పండించిన పంటను అమ్ము కోవాడనికి మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలో సంఘటన జరిగిన ఎందుకు హరీష్ రావు పట్టించుకోవడం లేదన అన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, కానీ స్థానిక నాయకులు ఇచ్చిన సమాచారంతో తాను వచ్చి బాధిత కుంటుంబానికి ఆర్థిక సహాయం చెసానని, తాను ఇక్కడ పోటీ చేసేది లేకున్నా మానవత్వంతో సహాయం చేస్తున్నానని అన్నారు.

Recommended Video
తన శక్తి కొద్దీ 2 లక్షల రూపాయల సహాయం చేసానని, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబ అదుకొని 25 లక్షల రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేసారు. బాదిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని జగ్గారెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, పోరాడి రైతు పంటను కొనుగోలు చేసాలాగా చూడాలని పేర్కొన్నారు జగ్గారెడ్డి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసారు. అంతే కాకుండా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్దయెత్తున చేరికలు జరిగాయి.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పార్టీలో చేరన వారికి కండువా కప్పి ఆహ్వానించారు జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి తో పాటు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పేట శంకర్ , టీపీసీసీ కార్యదర్శి దేవపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications