ఇంకా రాని అభ్యర్థుల ప్రకటన; అక్కడ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!!

నామినేషన్లకు నేటితో కలిపి మూడు రోజులే గడువుంది. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా 4స్ధానాలకు అభ్యర్దులను ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో ఉంచితే.. అందులో మూడు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఉన్నాయి. దీంతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక విధమైన అయోమయం నెలకొంది.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా 4స్ధానాలకు అభ్యర్దులను ప్రకటించకపోవడంతో ఆపార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవైపు మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసుకొని ప్రచారాలలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నాలుగు స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Joint nalgonda district congress leaders tension for not announcing three seats tickets

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఎప్పుడుంటుందోనని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఈ మూడు స్థానాలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నవే కావడంతో పాటు ఈ సారి కూడా అక్కడ కాంగ్రెస్ గెలుపుపై భారీ అంచనాలే ఉన్నాయి.

దీంతో అందరి దృష్టి ఆమూడు స్ధానాలపైనే ఉంది. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమై నాలుగు రోజులు పూర్తవగా. నామినేషన్ దాఖలుకు నేటితో కలిపి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. గత ఎన్నికల్లోనూ ఈ మూడు స్థానాలకు చివరి రెండు రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ఈ సారి కూడా చివరి నిమిషంలోనే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు.

ఈ మూడు నియోజకవర్గాల్లోనే పరిస్థితి పునరావృతం కావడంతో ఇక్కడి పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, మందుల సామేల్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి తో పాటు సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి లు పోటీపడుతున్నారు.

అయితే ఈ మూడు నియోజకవర్గాలలో ప్రతి స్ధానం నుంచి ఇద్దరు చొప్పున పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కష్టమవుతుందని అందుకే అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యమవుతుందని ఆపార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సాయంత్రానికి లేదా రేపు ఉదయం వరకు అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+