ఫ్రీగా 4 సిలిండర్లు: అవినీతి సర్కారును పంపాలంటూ జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ పిలుపు

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు జాతీయ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్​‌లో జేపీ నడ్డా పర్యటించారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌​కు ఏటీఎంలా మారిందని ఈ సందర్భంగా నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్​ బెడ్​ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట తప్పారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని.. తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.

 JP nadda and yogi adityanath hits out at kcr govt in election campaign in telangana

ప్రతి బీఆర్​ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడని.. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అవినీతిమైందని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలో రాఫెల్, కామన్​వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందన్నారు. దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. 4 కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎరువులు సబ్సిడీకి అందిస్తామని చెప్పారు.

అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వండి: యోగి ఆదిత్యనాథ్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌​కు మద్దతుగా యోగి ఆదిత్యనాథ్ రోడ్‌​షోలో పాల్గొన్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దీంతో కుత్బుల్లాపూర్ రహదారులన్నీ కాషాయమయం అయ్యాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌​పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా నడుస్తోందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి కుటుంబపాలన రాజ్యమేలుతుందని.. వీరితో ఇంకా ఎన్ని రోజులు బాధ పడతారని యోగి ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రజల జీవితాలను మారుస్తుందన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఎలా నిర్మిస్తున్నామో.. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అవకాశమిస్తే ప్రజల ఆశయాలను అలాగే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు యోగి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల ఆట కట్టించామన్నారు. భారత దేశం వైపు చూడాలంటేనే ఉగ్ర మూలాలకు వెన్నులో వణుకుపుడుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు యోగి ఆదిత్యనాథ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+