జూబ్లీహిల్స్ ప్రమాదం, నలిగిపోయారా: ఆసుపత్రి బిల్లు చెల్లించలేక, విషాదగాథ! ప్రేమించినవాడి..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జుబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో జరిగిన ప్రమాదానికి కారకుడైన విష్ణువర్ధన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సంఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విష్ణును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

  జూబ్లీహిల్స్ ప్రమాదం : మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరక వీడియోలు, పలు కోణాలు !

  ఇందుకు అనుమతిస్తే ప్రమాదంపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. లేదంటే అంతకుముందు ఏదైనా జరిగిందా అనే విషయం తెలిసే అవకాశం ఉండదని అంటున్నారు. రోడ్డు నెంబర్ 10లో వాహనాల రద్దీ కొంచం తక్కువగా ఉంటుంది. ఈ దారిలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో మస్తానీ మృతి చెందారు. మరో ఇద్దరు యువతులు చికిత్స పొందుతున్నారు.

  జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి: మరో కారు మధ్యలో, అమ్మాయిలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?

  సీసీ ఫుటేజీలో స్పష్టత లేదు

  సీసీ ఫుటేజీలో స్పష్టత లేదు

  ప్రమాదం జరిగిన రోడ్డులో కొద్ది దూరం ఎగుడు దిగుడులతో ఉంది. దీంతో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రమాదస్థలికి సీసీ కెమెరాకు మధ్య దూరం ఉండటంతో ఆయా దృశ్యాలు అంత కచ్చితంగా కనిపించడం లేదని తెలుస్తోంది.

  అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

  విష్ణు కట్ చేసే క్రమంలో

  విష్ణు కట్ చేసే క్రమంలో

  ప్రమాదం జరిగిన సమయంలో విష్ణు నడుపుతున్న కారు దాదాపు అరవై కిలో మీటర్ల వేగంతో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ముగ్గురు యువతులు ప్రయాణిస్తున్న స్కూటి ముందు మరో కారు నెమ్మదిగా వెళ్తున్నట్లు ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న కారుకు డివైడర్‌కు మధ్య ఉన్న ఖాళీలో నుంచి తన కారును ముందుకు తీసుకెళ్లాలని విష్ణు కట్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు.

  రెండు కార్ల మధ్య నలిగిపోయారా

  రెండు కార్ల మధ్య నలిగిపోయారా

  ఈ క్రమంలో పక్కనే ఉన్న యువతులు వెళ్తున్న స్కూటీకి తగిలి ఉంటుందని, రెండు కార్లకు మధ్య యువతులు నలిగి ఉంటారనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. మస్తానీ ఎగిరిపడటం, విష్ణు కారుకు చిక్కుకొన్న ఆమెను కొద్ది దూరం లాక్కెళ్లడం వల్ల తీవ్రంగా గాయపడి ఉంటుందని భావిస్తున్నారు.

  అందుకే వేర్వేరు ప్రాంతాల్లో పడ్డారు

  అందుకే వేర్వేరు ప్రాంతాల్లో పడ్డారు

  సీసీ ఫుటేజీలో అన్నీ స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, అంతకుముందు దృశ్యాల ఆధారంగా పోలీసులు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ప్రమాదం జరిగిన తర్వాత విష్ణు తన కారు వేగాన్ని పెంచడం వల్ల తీవ్రత మరింత పెరిగిందని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ముగ్గురు యువతులు ప్రమాదంలో వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉంటారని భావిస్తున్నారు.

  ఆసుపత్రి బిల్లులు చెల్లించలేమని

  ఆసుపత్రి బిల్లులు చెల్లించలేమని


  ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ ప్రమాదంలో గాయపడిన యువతుల చికిత్సకు ఆసుపత్రి బిల్లులు చెల్లించే స్థోమత తమకు లేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన అనూష రెడ్డి అలియాస్ ప్రియా రెడ్డి అలియాస్ వెంకటలక్ష్మి, మరో యువతి అనూష (ఇంటర్ విద్యార్థిని)లు అపోలోలో చికిత్స పొందుతున్నారు. అనూష రెడ్డికి మెదడు ఆపరేషన్ కోసం రూ.2.20 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పగా, వారు చెల్లించలేమని చెప్పారని తెలుస్తోంది. అనూష రెడ్డికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె భర్తకు దూరంగా ఉంటున్నారు. భర్త ఆటో డ్రైవర్ అని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ మస్తాని నివసిస్తున్న భవనంలోనే అనూషరెడ్డి ఉంటోంది.

  అనూషకు తల్లిదండ్రులు లేరు

  అనూషకు తల్లిదండ్రులు లేరు

  గాయపడిన మరో యువతి అనూషకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి రాజమండ్రిలో కూరగాయ అమ్ముకొని జీవించే పిన్ని, బాబాయి వద్దనే ఉంటోంది. అనూష కూకట్‌పల్లిలో నివసించే స్నేహితురాలు నిహారిక ఇంటికి వచ్చింది. అనూష బంధువులు కూడా తాము మరో ఆసుపత్రిలో చేర్పిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇరువురి బంధువులు బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావును, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్‌ను కలిశారు.

  ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని

  ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని

  రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజమండ్రికి చెందిన అనూషకు మస్తానీకి చుట్టరికం ఉందని తెలుస్తోంది. మస్తానీ సమీప బంధువు దినేష్‌ను చాలాకాలంగా ప్రేమిస్తోంది. ప్రేమించిన వాడితో జీవితం గడపాలని గత ఏడాది డిసెంబర్ 5న నగరానికి వచ్చింది. కూకట్‌పల్లిలో బంధువుల ఇంట్లో ఉంటోంది. రాజమండ్రి నుంచి ఆమె సోదరుడు, మేనత్త వచ్చారు. వారు అనూషను చూసి ఆందోళనకు లోనయ్యారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a ghastly accident, a woman driving a scooty died and her two pillion riders sustained grievous injuries when one Vishnu Vardhan, driving his Tata Hexa in an inebriated condition, knocked their two-wheeler down on Road No. 10 Jubilee Hills in the early hours of Sunday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి