జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

నిన్న మొన్నటి వరకు ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు తెరపడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ఈ ప్రతిష్టాత్మక పోరుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఈ సీటును దక్కించుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉపఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గల్లీ టు ఢిల్లీ వరకు ప్రత్యేక ఫోకస్‌లో ఉంచారు.

Jubilee Hills Bypoll Fight Congress Finalizes Naveen Yadav BRS Banks on Sentiment Strategy

అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో, బంతిని అధిష్టానం గూటికి చేర్చారు. సుదీర్ఘ చర్చలు, సర్వేల ఆధారంగా ముగ్గురు అభ్యర్థులు - నవీన్ యాదవ్, బొంతు రాంమోహన్, సి.ఎన్. రెడ్డి పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి పంపింది.

చివరకు, ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుని నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ఖరారు చేసింది. గతంలో ఆయన ఎంఐఎం (MIM) తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్‌కు ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేసే అరుదైన అవకాశం దక్కింది.

నవీన్ యాదవ్‌ను ఖరారు చేయడంలో, ఈ నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు, సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించి ఒక అడుగు ముందుకేసింది. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకోవాలనేది బీఆర్‌ఎస్ వ్యూహం.

నవంబర్ 11న జరగబోయే ఈ ఎన్నికలో, అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, సెంటిమెంట్‌తో తిరిగి పట్టు సాధించాలని బీఆర్‌ఎస్ తలపడుతున్నాయి. కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఈ ప్రతిష్టాత్మక పోరులో ఎలా విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+