జూబ్లీహిల్స్ సమరం.. ఘర్షణలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కేసులు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన ఈ ఎన్నికలలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది ఒంటిగంట వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు 31.94 శాతం పోలింగ్ నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఘర్షణలు
ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పలు సమస్యాత్మక ప్రాంతాలలో ఘర్షణలు నెలకొన్నాయి. అయితే పోలీసులు తాము ఏమి చెబుతున్నా పట్టించుకోవడంలేదని బి ఆర్ ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. బోరబండలోని పోలింగ్ స్టేషన్లో పార్టీ కార్యకర్తల పైన స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆరోపించారు.

Jubilee Hills polling clashes cases against two MLAs and an MLC

బోరబండ, షేక్ పేటలలో ఉద్రిక్తత
బోరబండలో పోలింగ్ స్టేషన్లలో కరపత్రాలతో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపణలు చేశారు. పరస్పర ఆరోపణలతో బోరబండలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా షేక్ పేట డివిజన్లో ఉపఎన్నిక పోలింగ్ జరుగుతున్న క్రమంలో అభ్యర్థి మాగంటి సునీతను పోలింగ్ స్టేషన్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల పైన ఆమె మండిపడ్డారు.

దాడులు, కేసులతో ఉత్కంఠ
జవహర్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు అని, పోలీసులు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు షేక్ పేట డివిజన్లో బిజెపి యువమోర్చా డివిజన్ అధ్యక్షుడుపైన కాంగ్రెస్ నేతలు దాడి చేశారని బిజెపి నేతలు ఆరోపించారు. ఈ దాడులు మాత్రమే కాకుండా కేసులు నమోదు చేశారు. ఇక నిబంధనలను ఉల్లంఘిస్తున్న స్థానికేతర నేతల తీరుపై ఎన్నికలసంఘం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైన ఈసీ సీరియస్
ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పోలింగ్ బూత్ ల పరిసరాలలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైన ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు
ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ప్రజాప్రతినిధుల పైన ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+