జగన్ 'బెయిల్': ల్యాప్‌టాప్‌లో జడ్జికి రమాకాంత్ ఇంటర్వ్యూ చూపిన సిబిఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి దీనికి సంబంధించిన తీర్పును ఈ నెల 28కి రిజర్వ్ చేశారు.

జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జగన్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ రోజు వాదనలు జరిగాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

రమాకాంత్ అది మాట్లాడలేదు, సిబిఐ కావాలనే చేసింది: అరెస్ట్ పిటిషన్‌పై కోర్టుకు జగన్

జగన్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. సిబిఐ తరఫున సురేందర్ రావు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు.

Judge reserves judgement on YS Jagan bail cancellation petition

వాదనల సమయంలో రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను ల్యాప్‌టాప్‌లో సిబిఐ అధికారులు జడ్జికి చూపించారు. కాగా, సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో

మీడియాకు నో

జగన్ బెయిల్ రద్దుపై కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ సమయంలో మీడియాను సీబీఐ కోర్టు బయటకు పంపించింది. కాగా, కోర్టుకు జగన్‌తో పాటు సబితా ఇంద్రా రెడ్డి, విజయ సాయి రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ హాజరయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Judge reserved judgement on YSR Congress Party chief YS Jaganmohan Reddy's bail cancellation petition.
Please Wait while comments are loading...