రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?: నేడే విచారణకు బెయిల్ పిటిషన్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ పట్టనుంది. దీంతో ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఓటుకు నోటు కేసులో కీలక ఆధారాలు లభించాయని చెప్పిన ఏసీబీ అధికారులు, వాటిని కోర్టుకు అందించేందుకు సమయం కావాలని కోరిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం విచారణకు వచ్చిన ఈ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసన సంగతి తెలిసిందే.

రేవంత్‌రెడ్డి, సహ నిందితులకు బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్‌ తరఫు న్యాయవాది గురువారం ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. అందులో భాగంగానే దర్యాప్తు అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి టేపుల నకళ్లు కోరుతున్నారని డిఫెన్స్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

Judgement on MLA Revanth Reddy's bail petition today

ఈ పరిస్థితుల్లో టేపుల నకళ్లను వారికి అందజేయరాదని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ‘ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్‌ని ఇంకా తెరవలేదు. వాటిని పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొన్నారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలున్నాయన్న ఏపీ ప్రభుత్వం వాదనతో తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో కాస్తంత దూకుడును తగ్గించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌కు బెయిల్ గ్యారంటీ అన్న వాదన వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+