ఎన్టీఆర్ భవన్‌పై వెనక్కి: ప్లేస్, టైం మీరు చెప్పినా సరే... జూపల్లి మళ్లీ
మహబూబ్ నగర్: పాలమూరు ప్రాజెక్టులపై టిడిపి నేతలతో చర్చించేందుకు తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగచర్చకు నేను సిద్ధమేనని, మీరు సిద్ధమేనా? నేను చెప్తున్న మూడు తేదీల్లో చర్చకు రావాలని, లేదా టైమ్ మీరు డిసైడ్ చేసినా సరేనని, వచ్చేందుకు నేను సిద్ధమేనని, టిడిపి కార్యాలయంలో చర్చ పెడితే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని, అందుకే అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని, చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని, ప్రజలు, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని జూపల్లి సవాల్ విసిరారు.
అసెంబ్లీ కమిటీ హాల్ వేదికగా ఈ నెల 13, 15, 16 తేదీల్లో చర్చకు రావాలన్నారు. చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్తూనే జిల్లా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరి, మోసపూరిత లేఖలతో కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థలను తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న తీరును, టీడీపీ హయాంలో జిల్లాను ఉద్ధరించామని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్న టీడీపీ నాయకత్వపు డొల్లతనాన్ని ప్రజల ముందు ఆధారాలతో సహా బట్టబయలు చేయడానికి చర్చలో పాల్గొంటానని చెప్పారు.
మంచి - చెడ్డలు చర్చించడానికి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చర్చను టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. పాత్రికేయ సంఘాల ప్రతినిధుల సమన్వయంతో, పాత్రికేయులే న్యాయనిర్ణేతలుగా ఈ చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
తటస్థ వేదికగా అసెంబ్లీ కమిటీహాలులో చర్చను చేపట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. సోమవారం, బుధవారం, గురువారం మూడురోజుల్లో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి తాను సిద్ధమని, ఏదైనా ఇబ్బందులుంటే టీడీపీ నాయకులు నిర్ణయించే ఏ సమయానికైనా తాను సిద్ధమేనని చెప్పారు.
కాగా, పాలమూరు ఎత్తిపోతల పైన తాను చర్చకు సిద్ధమని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చి చర్చించేందుకు తాను సిద్ధమని జూపల్లి ఇటీవల చెప్పారు. దీంతో, రావుల చంద్రశేఖర రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాలుగు గంటల పాటు నిరీక్షించారు. కానీ జూపల్లి రాలేదు. దీనిపై రావుల మండిపడ్డారు. దీంతో, జూపల్లి తటస్థ వేదిక కావాలన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications