సహకరించండి: దుబాయ్ రూలర్‌తో జూపల్లి (పిక్చర్స్)
దుబాయ్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మంగళవారం నాడు దుబాయ్‌లో ఆ దేశ రాజు మహమ్మద్ బిన్ రషీద్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున అన్ని విధాలా సహకరించాలని కోరారు.
అనంతరం జూపల్లి అల్లనా ఇన్ ఫ్రా తదితర పారిశ్రామిక సంస్థళ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 150 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
లులు గ్రూపు పరిశ్రమలను ఆయన సందర్శించారు. మేకిన్ తెలంగాణలో భాగంగా ఆయన దుబాయ్‌లో పలువురితో భేటీ అవుతున్నారు.

జూపల్లి
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మంగళవారం నాడు దుబాయ్‌లో ఆ దేశ రాజు మహమ్మద్ బిన్ రషీద్‌తో భేటీ అయ్యారు.

మంత్రి జూపల్లి
వార్షిక పెట్టుబడుల సదస్సు తొలిరోజు సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వివరించిన దృశ్యం.

మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట టీఎస్‌ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ వెంకటనర్సింహా రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ దాట్ల వనిత కూడా పర్యటనలో ఉన్నారు.

ఉపాధి
వచ్చే మూడేండ్లలో ఐసీటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి కల్పనతోపాటు ఎగుమతులను 10 బిలియన్ డాలర్ల నుంచి 17 బిలియన్లకు పెంచాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నది.












Click it and Unblock the Notifications