దారుణం: నోరు తెరిచిన సంప్, యువతి దుర్మరణం

ప్రమాదవశాత్తు సంపులో పడి ఓ యువతి దుర్మరణం పాలైంది. వాల్వ్ బంద్ చేయడానికి అందులోకి వంగిన సమయంలో ఆమె జారి సంపులో పడింది.

హైదరాబాద్ : ఇంటిలోని నీటి సంపులో వాల్వ్‌ను బంద్‌ చేయబోయి ప్రమాదవశాత్తు అందులో పడి ఓ యువతి మరణించింది. ఈ సంఘటన హైదరాబాదులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పెండ్యాల భిక్షపతిరావు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, మదమపల్లి గ్రామానికి చెందిన వంగిడి నర్సింహ కుటుంబం కుత్బుల్లాపూర్ సర్కిల్ ఏపీహెచ్‌బీకాలనీలో ఉంటున్నారు. నర్సింహ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మంచినీళ్లు పట్టిన తర్వాత నర్సింహ కుమార్తె జ్యోతి (21) వాల్వ్‌ను బంద్‌చేయడానికి సంప్‌లోకి వంగింది. ప్రమాదవశాత్తు జారి నీటిలో పడింది.

Jyothy dies falling in a sump

కొద్ది సేపటికి కూతురు కనిపించడం లేదని ఇంటిలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితంలేక పోవడంతో చివరకు సంపులో చూడగా అందులో కనిపించింది. జ్యోతిని వెంటనే బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు బాలానగర్ పోలీసులు మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాందీ ఆస్పత్రికి తరలిం చి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+