హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ISI ఏజెంట్..యూట్యూబర్ కాదు ముదురు ముంజ

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త సద్దుమణుగుతున్న తరుణంలో, జ్యోతి మల్హోత్రా అనే మహిళ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హర్యానాలో పుట్టి, పాకిస్థాన్ గూఢచారిగా మారిన ఆమె కథ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించిన జ్యోతి మల్హోత్రా అసలు ముఖం 2023లో పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే బయటపడింది. అక్కడ ISI ఏజెంట్ డానిష్‌తో పరిచయం ప్రేమగా మారి, చివరకు దేశద్రోహానికి దారితీసింది.

Jyoti Malhotra who has become a Pakistani spy is creating a stir in Hyderabad

యూట్యూబర్ ముసుగులో భారత సైనిక స్థావరాలను చిత్రీకరించి, మన దేశ రహస్యాలను పక్కాగా డానిష్‌కు చేరవేసింది. చివరికి 2024లో హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో సంచరిస్తూ సైనికుల కదలికలను చేరవేస్తుండగా అనుమానం వచ్చి అరెస్టయ్యింది. ఆమె ఫోన్ పరిశీలించగా టెర్రరిస్టులతో సంబంధాలున్నట్లు నిర్ధారణ అయింది.

ఇదిలా ఉండగా, జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె హంగామా చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అప్పటి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆమె అతిగా ప్రవర్తించిన దృశ్యాలు చూసి హైదరాబాదీలు షాక్‌కు గురవుతున్నారు.

ఆ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అప్పుడే ఈ విషయం తెలిసి ఉంటే ఇక్కడే పాతేసేవాళ్ళం" అంటూ తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఆమె యూట్యూబర్ కాదని మహా ముదురని కామెంట్స్ చేస్తున్నారు. దేశద్రోహి ఒకప్పుడు తమ నగరంలో సందడి చేసిందన్న వార్త వారిని కలచివేస్తోంది.

యూట్యూబ్ ట్రావెలింగ్ పేరుతో దేశంలోని కీలక ప్రాంతాల్లో పర్యటించి సమాచారం సేకరించడం ఆమె వ్యూహంలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. అందమైన ముఖం వెనుక దాగున్న దేశద్రోహి అసలు రూపం ఇప్పుడు అందరినీ భయానికి గురిచేస్తోంది. ప్రేమ పేరుతో దేశ రహస్యాలు శత్రుదేశానికి చేరవేయడం ఎంతటి దారుణమో ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది. జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+