ప్రతిపక్షాల వలలో కోదండరాం..! వాస్తవాలను గుర్తెరగాలి : కడియం
వరంగల్ : తెలంగాణ దిశా నిర్దేశకుడు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ జయంతి సందర్బంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్న కడియం.. జయశంకర్ కు నివాళులు అర్పించిన అనంతరం కోదండరాం పై పలు వ్యాఖ్యలు చేశారు.

టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రతిపక్షాల వలలో చిక్కుకుపోతున్నారని కామెంట్ చేశారు కడియం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కోదండరాం అంటే తమకు చాలా గౌరవముందని, అయితే ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం బాగా లేదని కడియం చెప్పారు.
కోదండరాంపై అటు ప్రజల్లోను ఇటు ప్రభుత్వ నేతల్లోను ఇంకా నమ్మకముందన్న కడియం.. ఆయన సలహాలు సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కానీ కోదండరాం మాత్రం ప్రతిపక్షాల వలలో చిక్కుకుపోతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ప్రతిపక్షాలకు వలలో పడకుండా కోదండరాం జాగ్రత్తపడాలని మంత్రి కడియం సూచించారు.












Click it and Unblock the Notifications