ఇష్టమొచ్చినట్లు లోకేష్, టిడిపికి బుధ్ది రాలేదు: కడియం ఫైర్, కాంగ్రెస్‌పై తలసాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన టీడీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. టిడిపి నేత లోకేష్‌కు జకీయ అనుభవం లేదని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
జీహెచ్‌ఎంసీలో టీడీపీ చౌకబారు విమర్శలకు ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. గ్రేటర్‌లో 100 సీట్లకు పైగా గెలుస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటరిగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ది చూపిస్తామన్నారు.
వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో 3 లక్షల డబుల్ బెడ్‌రూమ్స్ ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. గత డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని పేర్కొన్నారు. త్వరలోనే డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్‌కు 15శాతం సీట్లోస్తే రాజీనామా
హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్ల కలను సాకారం చేసింది టిఆర్‌ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఉదయం ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 శాతం సీట్లు గెలిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
గోదావరి నీళ్ల కలను సాకారం చేసింది టీఆర్‌ఎస్ పార్టీనేనని తెలిపారు. నగరంలోని 22 లక్షల కుటుంబాలకు చెత్త డబ్బాలు ఇచ్చామన్నారు. చెత్త సేకరణకు 2500 వాహనాలు మంజూరు చేశామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications