14న డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం: కడియం

హైదరాబాద్: బాలల దినోత్సవమైన నవంబర్ 14న తెలంగాణ రాష్ట్రంలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభించడానికి తీసుకోవాలసిన చర్యలపై సంబంధిత శాఖాధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యార్ధుల కు డిజిటల్ లిటరసీలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. నవంబర్ 14న 1500 పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభించటానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లు ప్రారంభించే పాఠశాలల వివరాలను జిల్లాల వారిగా తయారు చేయాలని, ఆయా పాఠశాలల్లో మౌళిక వసతులు, ఇక్విప్ మెంట్ , చేపట్టవలసిన రిపేర్లు పాఠశాలల వారిగా రూపొందించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+