'పుష్కరాల్లో అంచనాలకు మించి భక్తులు', పుష్కర స్నానం చేసిన కవిత

హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలు శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. ముగింపు వేడులకు తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చివరి రోజు కావడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున ఘాట్లలో స్నానమాచరించేందుకు వస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.

శనివారం ఉదయం వరంగల్ జిల్లా మంగపేట పుష్కరఘాట్‌ను కడియం శ్రీహరి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాలు విజయవంతం కావడం వెనుక జిల్లా కలెక్టర్ వి.కరుణ, రూరల్‌ ఎస్పీ ఎ.కిశోర్‌జా కృషి ఉందని చెప్పారు.

మంగపేట పుష్కర ఘాట్‌ను ఏడాది పొడవునా భక్తులకు అందుబాటులో ఉంచుతామని, త్వరలో ఇక్కడ శివాలయం కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పుష్కరాలకు ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని అన్నారు.

kadiyam srihari says too much crowd for godavari pushkaralu

పుష్కరాల్లో భాగంగా భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య వచ్చిన మాట వాస్తవమేనని, వెంటనే అధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరించామని అన్నారు. పుష్కర అనుభవంతో మేడారం జాతరను సమర్ధవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

మంగపేటలో పుష్కర స్నానం చేసిన ఎంపీ కవిత

నిజామాబాద్‌ ఎంపీ కవిత వరంగల్‌ జిల్లాలోని మంగపేటలో పుష్కర ఘాట్ వద్ద పుష్కరస్నానమాచరించారు. స్థానిక మహిళలతో కలిసి గోదావరిమాతకు పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాలు చివరిరోజు కావడంతో మంగపేట పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+