వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం సేవించి..: 22మంది విద్యార్థులపై వేటేసిన కాకతీయ మెడికల్ కాలేజీ

|
Google Oneindia TeluguNews

వరంగల్: క్యాంపస్‌లోనే మద్యం సేవించిన 22మంది ఎంబీబీఎస్ విద్యార్థులను కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. డిసెంబర్ 4 వరకు వేటు కొనసాగుతుందని చెప్పింది. స్నేహితుడి పుట్టినరోజు పేరుతో విద్యార్థులు ఫూటుగా మద్యం సేవించి హాస్టల్‌లోకి వచ్చారు.

ఈ విషయాన్ని గుర్తించిన వాచ్‌మెన్ గుర్తించి ప్రిన్సిపాల్‌కి సమాచారం అందించాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ డా. వి. చంద్రశేఖర్ వారిని సస్పెండ్ చేశారు. ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Kakatiya medical college suspends 22 students for alcohol drinking in campus

కాగా, ఈ పార్టీలో విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిలో నిజం లేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది. పుట్టిన రోజు జరుపుకున్న విద్యార్థి గదిని తాను స్వయంగా సందర్శించానని, అక్కడ గంజాయి వాడినట్లుగా, దాచినట్లుగా గానీ ఎలాంటి ఆనవాళ్లు లేవని చంద్రశేఖర్ చెప్పారు.

గతంలో వరంగల్ ఎన్ఐటీ విద్యార్థుల వద్ద డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో ఈ విషయం గురించి మరింత సమాచారం రాబట్టేందుకు కమిటీ వేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా, హైదరాబాద్ తోపాటు వరంగల్ నగరంలో డ్రగ్స్ తీసుకుంటున్న కొందరు విద్యార్థులను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
22 MBBS students from the Kakatiya Medical College in Warangal were suspended on Wednesday on charges of drinking alcohol on campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X