ఆ యూనివర్సిటీలో మొన్న చికెన్ కర్రీ కోసం కొట్లాట.. నేడు చపాతీ కోసం ధర్నా!
కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న చికెన్ కర్రీ కోసం తలలు పగిలేలా కొట్టుకున్న విద్యార్థులు, నేడు చపాతీకి బదులుగా కిచిడీ పెట్టారని రోడ్డెక్కారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందుకు వచ్చి ధర్నా నిర్వహించారు.
మొన్న కాకతీయ యూనివర్సిటీలో చికెన్ కోసం కొట్టుకున్న ఘటన
కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ లో జరుగుతున్న ఘర్షణలు, ఫుడ్ విషయంలో కొనసాగుతున్న ఆందోళనలు చూసిన ప్రతి ఒక్కరికి విస్మయాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో విద్యార్థులకు భోజనం వడ్డించిన తర్వాత చికెన్ విషయంలో ఎంబీఏ, ఎకనామిక్స్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో తలలు పగిలే దాకా కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.

గొడవలు , కేసులు.. అయినా మారని విద్యార్థుల తీరు
దీనిపైన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొడవలతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఉన్నతాధికారులు గొడవలకు కారణమైన విద్యార్థులపైన యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ తాజాగా మరొక ఘటన చోటు చేసుకోవడం యూనివర్సిటీ అధికారులకు షాక్ అని చెప్పాలి. గొడవలు , కేసులు.. అయినా మారని విద్యార్థుల తీరుతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
కిచిడీ పాత్రను రోడ్డు మీదకు తెచ్చి ధర్నా
యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం సరిగా లేదని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఉదయం అల్పాహారం సమయంలో చపాతి పెట్టవలసిన చోట కిచిడీ పెట్టారని ఆగ్రహించిన విద్యార్థులు కిచిడి వండిన పాత్రను రోడ్డు మీదకు తెచ్చి ధర్నా నిర్వహించారు.
నాణ్యమైన భోజనం అందించటంలో యూనివర్సిటీ విఫలం
కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన సెకండ్ ఇయర్ పిజి విద్యార్థులు యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం పైన అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం అందించడంలో యూనివర్సిటీ విఫలమైందని, ఉదయం పూట అల్పాహారం కూడా మెనూ ప్రకారం పెట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
యూనివర్సిటీ పరువు రోడ్డు పాలు
కామన్ మెస్ లో పెడుతున్న భోజనం పైన విద్యార్థుల తీరు, రోడ్డుకెక్కి చేస్తున్న ధర్నాలు, కర్రలతో తలలు పగలు కొట్టుకుంటున్న ఘటనలు వెరసి కాకతీయ యూనివర్సిటీ పరువు గంగలో కలిసిపోతుంది. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయాల్సిన, విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు కల్పించాల్సిన యూనివర్సిటీలు ఆ పాత్రను సరిగా పోషించడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications