Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పహారాలో కాళేశ్వరం పనులు.. గడ్కోల్ పంపుహౌస్ వద్ద ఉద్రిక్తత.. ఎందుకంటే!!

గోదావరి నీళ్ల తరలింపు సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు నిజామాబాద్ జిల్లాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్యాకేజీ 21 లో చేపట్టబోయే రిజర్వాయర్ కు భూములు ఇచ్చేది లేదని ముంపు గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టు పనులను వారు పదే పదే అడ్డుకుంటున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు పనులు జరిపిస్తున్నారు. అయినాసరే ముంపు గ్రామాల ప్రజలు పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మంచిప్ప రిజర్వాయర్ డిజైన్ మార్పుపై గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత

మంచిప్ప రిజర్వాయర్ డిజైన్ మార్పుపై గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత

తాజాగా నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాళేశ్వరం 21 ప్యాకేజీ పరిధిలోని మంచిప్ప రిజర్వాయర్ డిజైన్ మార్పు నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు రీడిజైన్ రద్దు చేసే వరకు పనులు అడ్డుకుంటామంటూ తేల్చిచెప్పారు. ముంపు గ్రామాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

పోలీస్ పహారాలో పనులు మొదలుపెట్టిన అధికారులు

పోలీస్ పహారాలో పనులు మొదలుపెట్టిన అధికారులు

ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలు చావనైనా చస్తాము గానీ రీడిజైన్ తో ప్రాజెక్టు పనులు చేస్తే ఊరుకునేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఇక మంచిప్ప రిజర్వాయర్ పనులు కొనసాగించడం కోసం అధికారులు ముంపు గ్రామాల ప్రజలతో అనేకమార్లు సమావేశాలు నిర్వహించారు. ఇక ఈ సమావేశాలు కూడా రసాభాసగా మారడంతో మంచిప్ప, భైరాపూర్ వద్ద పోలీసు పహారాలో కాళేశ్వరం రిజర్వాయర్ పనులను అధికారులు మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ముంపు గ్రామాల ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

రీడిజైన్ రద్దు చేస్తామని రాతపూర్వకంగా రాసిస్తేనే ఆందోళన విరమిస్తామన్న ఆందోళనకారులు

రీడిజైన్ రద్దు చేస్తామని రాతపూర్వకంగా రాసిస్తేనే ఆందోళన విరమిస్తామన్న ఆందోళనకారులు

తమ భూములు తమకు కావాలని, రీడిజైన్ రద్దు చేయాలని అధికారులకు తెలియజేస్తున్న ముంపు ప్రాంతాల ప్రజలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని కోరుతున్నా ససేమిరా అంటున్నారు. రీడిజైన్ రద్దు చేస్తామని రాతపూర్వకంగా రాసిస్తేనే తాము ఆందోళనలు విరమిస్తామని వారు చెబుతున్నారు. మంచిప్ప గ్రామం చుట్టూ అడవులు విస్తరించి ప్రకృతి అందాలకు నిలయం గా ఉండేదని, ఎంతో ప్రశాంతంగా ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం కావడంతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారు చెప్తున్నారు.

స్థానిక ప్రజల ప్రతిఘటనలతో అధికారులకు తలనొప్పి

స్థానిక ప్రజల ప్రతిఘటనలతో అధికారులకు తలనొప్పి

1 టీఎంసి సామర్థ్యం కలిగిన రెండు చెరువులు కలుపుతూ రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ గ్రామం చుట్టూ ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద గ్రామం చుట్టూ కాల్వలు తవ్వారు. 21 ప్యాకేజీ కింద గోదావరి జలాలను తరలించడం కోసం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. స్టోరేజ్ ట్యాంకులు నిర్మించారు. ఇక్కడి నుంచి మంచిప్ప, మాసాని చెరువు నుండి నిజాంసాగర్ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ప్రణాళికలు రూపొందించినా, రీడిజైన్ తోనే స్థానికంగా ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. పోలీసుల పహారా నడుమ కాళేశ్వరం పనులు సాగిస్తున్న అధికారులు, స్థానికంగా ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళతారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+