Jeevan Reddy: కావాలనే నా భర్తను కేసులో ఇరికించారు: ప్రసాద్ గౌడ్ భార్య
జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య ఆరోపించారు. తన భర్త ప్రసాద్ గౌడ్ కేవలం ఎమ్మెల్యేను కలవడానికి మాత్రమే వెళ్లారని ఆమె చెప్పారు. ఎలాంటి ఆయుధాలను కూడా తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. సర్పంచ్ గా గ్రామంలో అనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
అభివృద్ధి పనులకు సంబంధించి రూ.18 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. చేసిన పనికి డబ్బులు రాక అప్పులకు నెలకు రూ.50 వడ్డీ కడుతున్నట్లు లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమి కానీ ఎలాంటి ఆదాయం లేదని కేవలం ఇల్లు మాత్రమే ఉందని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తము బీజేపీలో ఉన్నామని లావణ్య చెప్పారు.

టీఆర్ఎస్ వాళ్లు రామ్మంటేనే వచ్చామని.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేశారని లావణ్య వివరించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశామని.. ఆయన కలెక్టర్ కలవాలని సూచించాడు చెప్పారు. కలెక్టర్ వద్దకు వెళ్తే ఎమ్మెల్యేను కలవాలని ఆయన చెప్పారని లావణ్య గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కలిసేందుకు తన భర్త ప్రసాద్ గౌడ్ వెళ్లినట్లు లావణ్య తెలిపారు.












Click it and Unblock the Notifications