దేశంలోనే ప్రథమస్థానం: పేర్వారం, 2018లో పూర్తికానున్న కాళోజీ కళాకేంద్రం
హైదరాబాద్: పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి పరిచి దేశంలోనే రాష్ట్ర పర్యాటకరంగాన్ని ప్రథమస్థానంలో నిలుపుతామని మాజీ డీజీపీ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్మించే ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాకేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు.

మంగళవారం హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ కళాకేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. మూడున్నర ఎకరాల్లో ఈ కళాకేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 2018లో కళా కేంద్రం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

బంగారు తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విశేష కృషిచేస్తున్నారని పేర్వారం రాములు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ క్రిస్టినా, ఈడీ సుమిత్‌సింగ్, పీఆర్వో పీ పురేందర్ పాల్గొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications