వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొడ కొట్టడానికి బాలకృష్ణ సినిమాలు కావు: మీట్ ది ప్రెస్‌లో కవిత, రోడ్‌షో(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్, మజ్లిస్, తెలుగుదేశం ఇలా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. టిఆర్‌ఎస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని గ్రేటర్ ప్రజలను కోరారు టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత. ఒకవేళ తమ పనితీరు బాగా లేకుంటే.. తీర్పు కోసం తిరిగి ప్రజల ముందుకే వస్తామని చెప్పారు. గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ దక్కించుకుంటేనే హైదరాబాద్ సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అన్నపూర్ణలాంటి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంపై సీఎం కేసీఆర్‌కు ఓ విజన్ ఉందన్నారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు 24 గంటల కరెంటు, నీటి సరఫరా, మంచి డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ ఇబ్బందులులేని రహదారుల వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పించడం టిఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ది ఓపెన్‌మైండ్

గతంలో ఎన్నడూలేనివిధంగా టిఆర్‌ఎస్ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 శాతానికిపైగా మహిళలకు అవకాశం కల్పించిందని తెలిపారు. మేయర్ అభ్యర్థి ఎంపిక అనేది పూర్తిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయమన్నారు. మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం వల్ల సామాన్య మహిళలకు ఎలాంటి ఫరక్ పడదని అన్నారు. సీఎం కేసీఆర్ ఓపెన్ మైండ్‌తో ఉన్న వ్యక్తి అని, ఇకముందు జరిగే మంత్రివర్గ మార్పుల్లో మహిళలకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.

గ్రేటర్ ప్రచారంలో తాము పూర్తిగా హైదరాబాద్ ఆధారిత అంశాలపైనే ప్రచారం చేస్తున్నామని, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అనేది రాష్ట్రస్థాయి అంశమని చెప్పారు. ఇప్పటికే దీనిపై సీఎం కేసీఆర్ కమిటీ వేశారని, కమిటీ నివేదిక రాగానే కచ్చితంగా సిఫార్సులను అమలు చేస్తారని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కింద ఇప్పటికే భర్తీ అవుతున్న ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఒక పాలసీ నిర్ణయం రాకుండా దానిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

బాలకృష్ణ సినిమాలు కావు

సవాళ్లు విసరడం, తొడగట్టడానికి గ్రేటర్ ఎన్నికలనేవి బాలకృష్ణ సినిమాలాంటివి కావని కవిత అన్నారు. బీజేపీ-టీడీపీ హ్యాపీ హైదరాబాద్ అంటూ మ్యానిఫెస్టో విడుదల చేశారని, అందులో నగరమంతా వైఫై సేవలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్ర ఐటీ మంత్రిని హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తేనే రావడం లేదు.. వీళ్లు నగరమంతా వైఫై ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను అటుఇటుగా మార్చి వాళ్ల మ్యానిఫెస్టోను రూపొందించారని అన్నారు.

కవిత మీట్ ది ప్రెస్

కవిత మీట్ ది ప్రెస్

కాంగ్రెస్, మజ్లిస్, తెలుగుదేశం ఇలా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. టిఆర్‌ఎస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని గ్రేటర్ ప్రజలను కోరారు టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత.

కవిత మీట్ ది ప్రెస్

కవిత మీట్ ది ప్రెస్

ఒకవేళ తమ పనితీరు బాగా లేకుంటే.. తీర్పు కోసం తిరిగి ప్రజల ముందుకే వస్తామని చెప్పారు. గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ దక్కించుకుంటేనే హైదరాబాద్ సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు.

కవిత మీట్ ది ప్రెస్

కవిత మీట్ ది ప్రెస్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అన్నపూర్ణలాంటి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంపై సీఎం కేసీఆర్‌కు ఓ విజన్ ఉందన్నారు.

కవిత మీట్ ది ప్రెస్

కవిత మీట్ ది ప్రెస్

ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు 24 గంటల కరెంటు, నీటి సరఫరా, మంచి డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ ఇబ్బందులులేని రహదారుల వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పించడం టిఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గ్రేటర్ ప్రచారం

గ్రేటర్ ప్రచారం

మహానగరపాలకసంస్థ ఎన్నికల్లో దళితులంతా టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం ధర్నాచౌక్‌లో తెలంగాణ ఎంఆర్‌పీఎస్‌ బహిరంగసభ జరిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

గ్రేటర్ ప్రచారం

గ్రేటర్ ప్రచారం

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఇంతకాలం అధికారంలో ఉండి బస్తీలను బాగు చేయని నాయకులు ఓట్ల కోసం వస్తే తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకుంటున్నానని ప్రకటించారు.

గ్రేటర్ ప్రచారం

గ్రేటర్ ప్రచారం

త్వరలో హైదరాబాద్‌లో పేదలు దళితుల కోసం లక్ష రెండు పడకల ఇళ్లు, జగ్జీవన్‌రాం భవనం నిర్మించి ఇస్తామన్నారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

గ్రేటర్‌లోని అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే రీతిలో 18 నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, అందుకే పాజిటివ్ దృక్పథంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామే తప్ప ఇతర పార్టీల బలహీనతలపై ఆధారపడి ముందుకుపోవడంలేదన్నారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

పైగా హైదరాబాద్‌లో రూ.1200 ఆస్తి పన్ను, కరెంటు, నీటి బకాయిలకు సంబంధించి రూ.500 కోట్లు మాఫీ చేశామని చెప్పారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

రెండేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో టిఆర్‌ఎస్‌పై అపోహలు, అనేక అసత్యాలు ప్రచారం చేశారని.. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఇంటి పార్టీ అని నమ్ముతున్నారన్నారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

లక్ష పట్టాలు పంచినపుడు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని అమలు చేసినపుడు వాళ్లు శ్రీకాకుళంవాళ్లా, ఆదిలాబాద్ వాళ్లా అని చూడకుండా అమలు చేశామని చెప్పారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

2014లో తెలంగాణను ప్రకటించిన వెంటనే తెలంగాణభవన్‌లో జరిగిన మొదటి మీడియా సమావేశంలోనే ‘మా లక్ష్యం నెరవేరింది.. ఇక్కడ ఉన్న అందరూ మా బిడ్డలే' అని సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

ఆంధ్రవాళ్ల కాళ్లలో ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారంటే ఇతర ప్రాంత ప్రజలపై మా దృక్పథమేందో తేల్చిచెప్పారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఐటీ వృత్తిలో కొనసాగుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

టిఆర్‌ఎస్ పార్టీ కేవలం అభివృద్ధి ఎజెండాగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. కానీ మజ్లిస్ సహా బిజెపి, టిడిపిలు మతతత్వ అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. మతతత్వ పార్టీలకు హైదరాబాద్ ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం

రెండు తెలుగు రాష్ర్టాలకు ప్యాకేజీలుగానీ, ఆర్థికంగా చేయూతగానీ ఇప్పించలేని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్యాకేజీలు-లీకేజీలు అని ప్రాస కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.

కవిత గ్రేటర్ ప్రచారం

కవిత గ్రేటర్ ప్రచారం


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. హైదరాబాద్‌కు ఏం చేసిందని ప్రశ్నించారు. రూ.20వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే తాను బీజేపీకి ఓటేస్తానని గతంలోనే కాదు ఇప్పుడు కూడా అంటున్నాని తెలిపారు. ప్యాకేజీలు-లీకేజీలు అని మాట్లాడే వారికి హైదరాబాద్ ప్రజలు మంచి ఓల్టేజీతో షాక్ ఇవ్వాలన్నారు.

మాది పేదల అంబాసిడర్ కారు

‘లోకం తెలియని లోకేశ్‌బాబు మాట్లాడితే మా తాత, మా నాన్న అంటారు. ఎన్టీఆర్ రాక ముందు కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందే ఉంది. ఐటీ రంగానికి చంద్రబాబు కొంత చేశారనేది కాదనలేని సత్యం. సైబర్ టవర్స్ కట్టిన ఆయన పక్కన ఉన్న మురికివాడల్ని పట్టించుకోలేదు' అన్నారు.

‘ఎంతసేపు దాని ముందు ఉన్న జయభేరి సంస్థను ఎలా అభివృద్ధి చేయాలి, ఎక్కడికి తరలించాలనేదే చూశారు. మా తాత, మా నాన్న అంటే ఇంకా అనేక విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. అంబాసిడర్ కారు పేద ప్రజలది. కాంగ్రెస్‌గానీ, ఇతర పార్టీల నాయకత్వంపై నమ్మకంలేక ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు' అని కవిత చెప్పారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha on Wednesday held meet the press.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X