వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్దతివ్వండి: పసుపు బోర్డుపై కేరళ సీఎం చాందీతో కవిత భేటీ(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పసుపు కనీస మద్దతు ధర, పసుపుబోర్డు ఏర్పాటుకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇందులో భాగంగా ఆమె సోమవారం కేరళ సీఎం ఊమెన్‌చాందీతో తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, మద్దతు ధరను ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేరళ ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో తమ రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలుగుతుందని.. ఈ విషయంలో తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చాందీ పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

కాగా, దేశవ్యాప్తంగా పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితోను సమావేశమై కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే తమిళనాడు సీఎం జయలలిత, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీలతోను భేటీ కావాలని యోచిస్తున్నారు.

ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోగా ఈ అంశంపై పలు రాష్ట్రాల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. పసుపు వాణిజ్య పంట అని.. మద్దతు ధర ఇవ్వలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. వారికి మద్దతుగా కవిత పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించాలని భావిస్తున్నారు.

ఊమెన్ చాందీతో కవిత

ఊమెన్ చాందీతో కవిత

పసుపు కనీస మద్దతు ధర, పసుపుబోర్డు ఏర్పాటుకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇందులో భాగంగా ఆమె సోమవారం కేరళ సీఎం ఊమెన్‌చాందీతో తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

ఊమెన్ చాందీతో కవిత

ఊమెన్ చాందీతో కవిత

ఆమె వెంట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్‌, విద్యాసాగర్‌రావు, వేముల ప్రశాంత్‌, తెరాస నేత డా. సంజయ్‌ కుమార్‌లు ఉన్నారు. సమావేశం అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఊమెన్ చాందీతో కవిత

ఊమెన్ చాందీతో కవిత

కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, మద్దతు ధరను ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేరళ ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.

ఊమెన్ చాందీతో కవిత

ఊమెన్ చాందీతో కవిత

బోర్డు ఏర్పాటుతో తమ రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలుగుతుందని.. ఈ విషయంలో తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చాందీ పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయంపై కవిత ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడణవీస్‌తో భేటీ అయ్యారు.

ఊమెన్ చాందీతో కవిత

ఊమెన్ చాందీతో కవిత

తెలంగాణ తర్వాత అత్యధికంగా పసుపు పండించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎంపీ వాదనతో ఏకీభవించడంతోపాటు ఈమేరకు ఆమెకు లేఖ కూడా రాశారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha on Monday met Kerala CM Oommen Chandy for Turmeric board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X