హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో రెస్ట్! ఇక దేశ వ్యాప్తంగా..: బీజేపీపై తగ్గేదే లేదంటు కల్వకుంట్ల కవిత, గొంతు నొక్కేస్తారా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జాగృతి జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశామని ఆ సంస్థ అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.తెలంగాణ ఉద్యమ సమయంలో భాష, పండగలపై ఉన్న వివక్షను చాటిచెప్పామని, శ్రీకృష్ణ కమిటీకి కూడా తెలిపామని కవిత చెప్పారు.

బీజేపీ వైఫల్యాలపై మాట్లాడితే దాడులంటూ కవిత

బీజేపీ వైఫల్యాలపై మాట్లాడితే దాడులంటూ కవిత

గతంలో బతుకమ్మ ఆడాలంటే సిగ్గుపడేవారని.. ఇప్పుడు ఆడపిల్లలందరూ ముందుకు వస్తున్నారని కవిత చెప్పారు. తెలంగాణ సాధించిన మనం.. ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు.

దేశంలో 8 ప్రభుత్వాలను కూల్చినా.. పత్రికలు, మేధావులు స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం కొందరి జర్నలిజం సిగ్గుపడేలా ఉందన్నారు కవిత. బీజేపీ ప్రభుత్వం దేశంలో అందర్నీ ఇబ్బంది పెడుతోందని కవిత ఆరోపించారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపితే.. ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని అన్నారు. సిస్టమ్ ను కాపాడుకోవాలన్నారు.

ఆ సత్తా తెలంగాణ జాగృతికే ఉందంటూ కవిత

ఆ సత్తా తెలంగాణ జాగృతికే ఉందంటూ కవిత

తెలంగాణ జాగృతి ప్రజలందర్నీ చైతన్యపర్చాలన్నారు. దేశ వ్యాప్తంగా అన్యాయం జరుగుతోందన్నారు. సిస్టమ్ ను కాపాడుకోవాలన్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రాకున్నా దేశంలో ఎక్కడా ఆందోళనలు జరగడం లేదన్నారు. తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఇలాంటి భావజాలాన్ని తీసుకెళ్లే సత్తా తెలంగాణ జాగృతికే ఉందన్నారు.

ప్రతి రాష్ట్రంలో కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, మహిళలను ఏకం చేస్తామని కవిత అన్నారు. రైతులు, మేధావులను కలుస్తామన్నారు. తెలంగాణలో చేసినట్లుగా దేశ వ్యాప్తంగా చేయాలన్నారు. తెలంగాణలో ప్రతి ప్రాంతంలో కార్యకర్తలు, నేతలు ఉన్నారని.. ప్రపంచంలోని 18 దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలున్నాయన్నారు.

తెలంగాణ ఆడపిల్ల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తాయన్న కవిత

తెలంగాణ ఆడపిల్ల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తాయన్న కవిత

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తన ఏజెన్సీలతో బీజేపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తనపైనా సీబీఐ దాడులు జరుగుతున్నాయని కవిత చెప్పారు. దాడులతో సమయం అంతా వృథా చేస్తున్నారన్నారు. కానీ మనం డబుల్ త్రిబుల్ పనిచేయాలని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. మన నేతలు కొందరు ఆడపిల్లను కన్నీళ్లు పెట్టుకోనివ్వొద్దని అన్నారు. ఏ ఆడపిల్ల గురించి తెలియదు కానీ.. తెలంగాణ ఆడపిల్ల నుంచి కన్నీళ్లు రావు.. నిప్పులు వస్తాయని కవిత వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

బీజేపీపై తగ్గేదే లేదన్న కవిత

ఏం జరిగినా ముందుకే.. బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు కవిత. దేశంలోని ప్రతిచోటకు వెళ్లాల్సిందేనని కవిత అన్నారు. జిల్లాకు పనిచేసినవాళ్లు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రెస్ట్ తీసుకునేది లేదు. రిలాక్స్ అయ్యేది లేదు. భారత రూపాయి మారరకం పతనమైందని, డెమోక్రసీ ఇండెక్స్ లోనూ భారత్ ర్యాంక్ దిగజారిందని కవిత అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నికలున్నాయని.. అందరూ సిద్ధం కావాలన్నారు కవిత. కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఇక్కడే గొంతు నొక్కేస్తారా? అంటూ కవిత ఛమత్కారం

ఇక్కడే గొంతు నొక్కేస్తారా? అంటూ కవిత ఛమత్కారం

కాగా, ఈ సమావేశంలో మైక్ కొంత అంతరాయం కలిగించింది. దీంతో ఇక్కడే నా గొంతు నొక్కెస్తారా? అని కవిత ఛమత్కరించారు. మరో మైక్ ఏర్పాటు చేయడంతో కవిత తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోసారి తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకుందామని కవిత చెప్పారు. సమావేశానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

English summary
Kalvakuntla Kavitha slams BJP in Telangana Jagruthi meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X