వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి కన్నుమూత - సీఎం కేసీఆర్, ముఖ్య నేతల సంతాపం

|
Google Oneindia TeluguNews

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (73) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం కన్నుమూశారు. తీవ్రమైన గొంతు నొప్పితో హైదరాబాద్ లోని ఓమెగా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే మరణంతో నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భిన్నమైన అసెంబ్లీ నియోజకవర్గంగా పేరున్న కల్వకుర్తి నుంచి ఎడ్మ కృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1994లో ఇండిపెండెంట్‌గా, 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన విజయం సాధించారు. కిష్టా రెడ్డి మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ - డీజీపీపైనా టీడీపీ విసుర్లు - గంటకో ట్విస్ట్..ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ - డీజీపీపైనా టీడీపీ విసుర్లు - గంటకో ట్విస్ట్..

Kalwakurthy former MLA Edma Krishna Reddy passes away, cm kcr condolence

సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కిష్టారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు తదితరులు కూడా సంతాపం తెలిపారు.

Kalwakurthy former MLA Edma Krishna Reddy passes away, cm kcr condolence
English summary
Kalwakurthy former MLA Edma Krishna Reddy passed away here in Hyderabad on Tuesday after a brief illness. Krishna Reddy served as two-time MLA from Kalwakurthy assembly constituency. Chief Minister K Chandrasekhar Rao condoled the demise of Krishna Reddy and expressed condolences to the bereaved family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X