జనసేనకు ఝలక్?: యువతికి పాడైన ఫోన్ అమ్మి, తుపాకీతో బెదిరించిన కళ్యాణ్ అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తక్కువ ధరకు ఐఫోన్ 7 అమ్ముతానంటూ పాడైన సెల్‌ఫోన్‌ను అంటగట్టాడు ఓ యువకుడు. దానిపై బాధితులు నిలదీస్తే తుపాకీతో బెదిరించాడు.

చదవండి: ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

ఈ ఆరోపణలతో కళ్యాణ్ సుంకర అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కళ్యాణ్ ఓఎల్‌ఎక్స్‌లో ఐఫోన్‌7ను అమ్మకానికి పెట్టాడు. కొనేందుకు ఆసక్తి చూపిన స్వాతి అనే టీవీ ఛానల్ యాంకర్ అతడిని సంప్రదించింది.

రూ.56వేల ఫోన్, 16 రోజులు వాడానని చెప్పి

రూ.56వేల ఫోన్, 16 రోజులు వాడానని చెప్పి

రూ.56వేల ఫోన్‌ను 16 రోజులు మాత్రమే వాడానని చెప్పిన సుంకర కళ్యాణ్ రూ.44వేల ధర చెప్పడంతో రెండు రోజుల క్రితం కొనుగోలు చేశారు. చీకట్లో అతను ఫోన్‌ ఇచ్చాడు. కళ్యాణ్ ఫోర్డ్‌ ఇండీవర్‌ కారులో రావడంతో స్వాతికి అనుమానం రాలేదు.

పాడైన ఫోన్ రావడంతో

పాడైన ఫోన్ రావడంతో

ఇంటికి వెళ్లి చూస్తే అది పాడైన సెల్‌ఫోన్ కావడంతో స్వాతి కుటుంబసభ్యులు ఫోన్‌ చేసి కళ్యాణ్‌ను నిలదీశారు. చివరకు శనివారం డబ్బులు తిరిగి ఇస్తానని చిలకలగూడ పార్క్ వద్దకు రమ్మని బాధితులకు చెప్పాడు.

ఎయిర్ గన్‌తో బెదిరింపు

ఎయిర్ గన్‌తో బెదిరింపు

అక్కడికి వెళ్లిన వారిని కళ్యాణ్ ఎయిర్ గన్‌తో బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఓ పార్టీ అధికార ప్రతినిధిని అంటూ

ఓ పార్టీ అధికార ప్రతినిధిని అంటూ

తాను ఓ ప్రముఖ పార్టీకి అధికార ప్రతినిధినని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. భీమవరానికి చెందిన కళ్యాణ్ ప్రస్తుతం చిలకలగూడలో ఉంటున్నట్లు గుర్తించారు. కోఠిలో ఎయిర్‌గన్‌ కొనుగోలు చేసినా, బెదిరింపుల కోసం వినియోగంచడంతో తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించారు.

జనసేన తరఫున చర్చల్లో

జనసేన తరఫున చర్చల్లో

కాగా, కళ్యాణ్ సుంకర పలు టీవీ ఛానళ్లలో జనసేన తరఫున అనేక చర్చల్లో పాల్గొన్నారని అంటున్నారు. తాను జనసేన అధికార ప్రతినిధిగా పని చేస్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kalyan Sunkara arrested for fake iphone sale in online website.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి