పెళ్ళైనా మరో యువతితో లవ్: నా చావుకు ప్రియురాలే కారణమని సూసైడ్

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: తన మరణానికి ప్రియురాలే కారణమని కమలాకర్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది.

కమలాకర్‌కు భార్య, నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు.కమలాకర్‌ది శాయంపేట మండలం కొప్పుల గ్రామం. అయితే ఇటీవల కాలంలో మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన కమలాకర్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.

ప్రియురాలితో కమలాకర్ కొంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కమలాకర్‌తో ఆమె ప్రియురాలికి గొడవలు జరిగాయి. దీంతో ఆమె కూడ కమలాకర్‌కు దూరమైంది.

kamalakar suicide for love affair in Warangal district

అంతేకాదు తన బంధువులతో కలిసి వచ్చి కమలాకర్‌పై ప్రియురాలు దాడికి పాల్పడింది. అవమానపర్చింది. ఈ దృశ్యాలను ఫోన్‌లో కూడ చిత్రీకరించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కమలాకర్ ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కమలాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు ప్రియురాలే కారణమని సూసైడ్ నోట్ రాశాడు.ఈ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kamalakar suicide for love affair in Warangal district on Saturday. Together with his relatives, the girlfriend attacked on Kamalakar. So, He suicide on Saturday said police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X