భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు విద్యాసంస్థలు బంద్..

తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతూనే ఉన్నాయి. జోరు వానలు, వరదల కారణంగా రేపు మెదక్ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటు కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అలాగే పలు జిలాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో ఇవాళ 1,444 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. ఆరుగురు మిస్సింగ్ అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జీఆర్‌ కాలనీలో 250 మంది, రామాయంపేట్‌ లో 360 మందిని బృందాలు రక్షించాయి. కామారెడ్డి హౌసింగ్‌ బోర్డు కాలనీలో 70 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే రామాయంపేట SC,ST హాస్టల్‌ లో 84 మందిని రక్షించారు అధికారులు.

నిర్మల్‌-కామారెడ్డి మధ్య నేషనల్‌ హైవే కోతకు గురైంది. జాతీయ రహదారి 44పై భారీగా వాహనాల క్యూ కొనసాగుతోంది. హైదరాబాద్‌-నిర్మల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంటైనర్లు, భారీ లారీలను దారి మళ్లింపు చేశారు. జగిత్యాల- ఖానాపూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాసర దగ్గర బైంసా-నిజామాబాద్‌ పై వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. దీంతో భైంసా-బోధన్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

సిద్దిపేటలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కోమటి చెరువు నాలా ఉప్పొంగడంతో జల దిగ్బంధంలో సిద్దిపేట ఉంది. వరద కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. వరదల ధాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక బృందాలు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయన్నారు. ఇప్పటిదాకా వరదల్లో చిక్కుకున్న 2వేల మందిని రక్షించామని పేర్కొన్నారు.

Kamareddy Medak Schools Shut Holidays Declared on Friday Saturday Due to Floods

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం తో పాటు ఇతర మంత్రుల బృందం బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు. సీఎం రేవంత్‌ వెంట మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ సీఎస్‌, డీజీపీ జితేంద్ర, తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+