'కంచ ఐలయ్య మూర్ఖుడు, కోర్టుకు వెళ్తాం, అందుకే కేసీఆర్ సైలెన్స్'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కులం పేరుతో దూషించిన కంచ ఐలయ్య ఒక మూర్ఖుడు అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ సోమవారం ధ్వజమెత్తారు.

అమిత్ షా వచ్చి కూర్చోవాలి: కంచ ఐలయ్య కొత్త ట్విస్ట్, సమాధానం చెప్పలేకనా?

అమిత్ షాను కించపర్చారు, కంచ ఐలయ్యపై కోర్టుకు

అమిత్ షాను కించపర్చారు, కంచ ఐలయ్యపై కోర్టుకు

అమిత్ షాను కించపరిచేలా కంచ ఐలయ్య మాట్లాడారని, దీనిపై తాము కోర్టులో కేసు వేస్తామని కృష్ణసాగర్ చెప్పారు. కంచ ఐలయ్య ఇష్టారీతిన పుస్తకాలు రాస్తున్నారని, ఓ వర్గాన్ని టార్గెట్ పెట్టుకొని రాయడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌కు వైశ్యులంటే చులకనభావం

కేసీఆర్‌కు వైశ్యులంటే చులకనభావం

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్యవైశ్యులు అంటే చులకన భావం ఉందని కృష్ణప్రసాద్ ఆరోపించారు. అందుకే ఆర్య వైశ్యులను అవమానించినా పట్టించుకోవడం లేదన్నారు. కంచ ఐలయ్యపై ప్రభుత్వమే క్రిమినల్ కేసు ఎందుకు పెట్టడం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాలు లేవని, ఉనికిని కాపాడుకునేందుకే హింసకు పాల్పడుతున్నాయన్నారు.

ఆదివారం ఉద్రిక్త వాతావరణం

ఆదివారం ఉద్రిక్త వాతావరణం

కాగా, కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకంపై చర్చించేందుకు ఆయన ఇంటికి వస్తామని ఆర్య వైశ్య సంఘం నాయకుడు శ్రీనివాస్ గుప్త ప్రకటించి, ఆయన ఇంటి వైపుకు వెళ్లారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తొలుత చర్చకు సిద్ధమన్న కంచ ఐలయ్య ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని వైశ్య ప్రతినిధులు అంటున్నారు. ఎలాంటి తప్పు లేకుంటే ఎందుకు చర్చించడం లేదని వారి వాదన.

 అర్యవైశ్య ప్రతినిధుల ముందస్తు అరెస్ట్

అర్యవైశ్య ప్రతినిధుల ముందస్తు అరెస్ట్

చర్చల కోసం కంచ ఐలయ్య ఇంటికి శ్రీనివాస్ గుప్త, పలువురు ఆర్యవైశ్య ప్రతినిధులు ఆయన ఇంటి వైపుకు వెళ్లారు. మరోవైపు కంచ ఐలయ్య మద్దతుదారులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆర్యవైశ్య ప్రతినిధులను ముందస్తుగా అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ తరలించారు.

 డీజీపీకి మెమోరాండం

డీజీపీకి మెమోరాండం

తొలుత ఆర్యవైశ్య ప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధమన్న ఐలయ్య ఆ తర్వాత.. దీనిపై చర్చించాలంటే ఢిల్లీలోని జేఎన్‌యులో చర్చించాలే తప్ప పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునే వారితో చర్చించేది లేదని చెప్పారు. పుస్తకంపై చట్టపరంగా కోర్టులు తప్పని చెబితే తప్ప మార్చేది లేదన్నారు. మరోవైపు, తనకు ప్రాణభయం ఉందని కంచ ఐలయ్య సోమవారం డీజీపీకి మెమోరాండం ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Writer Kancha Ilaiah on Monday met DGP. BJP leader Krishna Sagar fired at Ilaiah for his controversial book.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి