కాళ్లు మొక్కి అవమానించారు: కెసిఆర్‌పై ఐలయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుగవర్నర్ నరసింహన్ కాళ్లకు మొక్కి రాష్ట్ర ప్రజల గౌరవరం దిగజార్చారని వై ఐ యామ్ నాట్ ఎ హిందూ గ్రంథ రచయిత కంచ ఐలయ్య విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు గ్రేటర్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఐలయ్య మాట్లాడారు.
గవర్నర్ దళితుడై ఉంటే కేసీఆర్ ఆయన కాళ్లు మొక్కేవారా అని ప్రశ్నించారు. దేవాలయాల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. ‘దేవుడా... రాక్షసుడా...మనుషుల్లో సమానత్వం ఎందుకు కల్పించలేద'ని మండిపడ్డారు.

ఇంతకాలం కమ్మలు కంపెనీలు పెట్టారని, వారిని తరిమి ఇప్పుడు వెలమలు కంపెనీలు పెడతామని ముందుకు వస్తున్నారని ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయని.. కాబట్టి, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
లక్ష్మీదేవి బ్రాహ్మణులకు, కోమట్లకు ధనం ఇస్తే అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలకు ధనం ఇచ్చాడని అన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై నక్సల్స్ నెలరోజుల్లోగా తమ వైఖరిని వెల్లడించాలని ఐలయ్యడిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications