నంద్యాల ఎఫెక్ట్: బిజెపి అధ్యక్ష రేసులో ఆ ముగ్గురు, కన్నాకు ప్రాధాన్యత

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పగ్గాలు ఎవరికి దక్కుతాయనే చర్చ పార్టీలో సాగుతోంది.2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకం ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బిజెపి అధ్యక్ష పదవికి సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని బిజెపి సన్నాహలు చేస్తోంది. టిడిపితో పొత్తు లేకున్నా స్వంతంగా పోటీచేసి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి జాతీయ నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.అయితే ఈ తరుణంలో బిజెపి అధ్యకుడి ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాలు , భవిష్యత్తులో రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని బిజెపి అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మాత్రం ఇప్పటికిప్పుడే తేల్చలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు

ఆయితే 2019 ఎన్నికల వరకు టిడిపితో పొత్తు ఉంటుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పొత్తులపై మాత్రం ఇప్పటికిప్పుడే చెప్పలేకపోతున్నారు.

బిజెపి అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు

బిజెపి అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి నాయకత్వం కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు చేస్దోంది.అయితే సమర్ధుడైన నేత కోసం ఆ పార్టీ నాయకత్వం చూస్తోంది. అయితే సామాజిక సమీకరణలను కూడ దృష్టిలో పెట్టుకొంది.ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణల పేర్లు వినిపిస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత

కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత

కాపు సామాజికవర్గానికి చెందిన వారికి బిజెపి అధ్యక్ష పదవిని అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడ లేకపోలేదు.ఏపీలో సుమారు 12 శాతం కాపు సామాజికవర్గం ఓటర్లున్నారు. ఆ వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను కాపు సామాజికవర్గానికి బిజెపి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.కాపు సామాజికవర్గానికి చెందిన వారిలో బిజెపిలో కన్నా లక్ష్మీనారాయణ పేరు అధ్యక్షపదవి రేసులో ప్రముఖంగా విన్పిస్తోంది.

టిడిపితో స్నేహం బిజెపి అధ్యక్షుడి ఎంపికపై ప్రభావం

టిడిపితో స్నేహం బిజెపి అధ్యక్షుడి ఎంపికపై ప్రభావం

ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు టిడిపితో బిజెపికి మిత్రుత్వం ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే వీర్రాజు విమర్శలపై టిడిపి నేతలు కూడ అదే స్థాయిలో మండిపడిన సందర్భాలు కూడ లేకపోలేదు. వీర్రాజు లాంటి కొందరు నేతలు టిడిపితో పొత్తును కొనసాగించకూడాదని కోరుకొంటున్నారు. అయితే నంద్యాల ఫలితాల తర్వాత బిజెపి నాయకత్వం కూడ ఆచితూచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

నంద్యాల ఫలితాల తర్వాత బిజెపి నేతల్లో ఇలా

నంద్యాల ఫలితాల తర్వాత బిజెపి నేతల్లో ఇలా

బిజెపిలో చంద్రబాబుకు వ్యతిరేక వర్గంగా ముద్రపడిన నేతలు నంద్యాల ఫలితాల తర్వాత కొంత వెనక్కు తగ్గినట్టు కన్పిస్తోంది. నంద్యాలలో వైసీపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం టిడిపిపై తీవ్రంగా ఉండేది.కానీ, నంద్యాలలో టిడిపి విజయం సాధించిన తర్వాత మోడీ చేసిన ట్వీట్ కూడ బిజెపి నేతలను కొంత షాక్ గురిచేసింది. ఈ ట్వీట్ టిడిపి వర్గాల్లో ఉత్సాహన్ని నింపింది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Kanna Laxminarayana is likely to replace Visakhaptnam MP and BJP A.P. President Kambhampati Haribabu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి