కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..
కాన్సాస్ కాల్పుల నిందితుుడ ఆడమ్ ప్యూరింటన్ పచ్చి తాగుబోతు అని, అతను ఏ పని సరిగా చేసేవాడు కాదని చెబుతున్నారు. అతను రిపబ్లికన్ పార్టీ కార్యకర్త అని, కానీ కాల్పులతో రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు.
హైదరాబాద్: కాన్సాస్ కాల్పుల నిందితుుడ ఆడమ్ ప్యూరింటన్ పచ్చి తాగుబోతు అని, అతను ఏ పని సరిగా చేసేవాడు కాదని చెబుతున్నారు. అతను రిపబ్లికన్ పార్టీ కార్యకర్త అని, కానీ కాల్పులతో రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు.
అమెరికాలోని కాన్సాస్ కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే. మరో తెలుగు వ్యక్తి అలోక్ రెడ్డి గాయపడ్డారు. ఇది షాకింగ్‌కు గురి చేసింది. జాత్యాహంకారంతోనే నిందితుడు ఆడమ్ కాల్పులు జరిపాడనే అరోపణలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్థానికుల వాదన మరో రకంగా ఉంది.

అప్పటి నుంచి పెరిగిన వ్యసనం
నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ పచ్చి తాగుబోతు చెబుతున్నారు. చాలా కాలం నుంచే అతడికి ఈ చెడు అలవాటు ఉన్నప్పటికీ పద్దెనిమిది నెలల కిందట తండ్రి మరణించినప్పటి నుంచి ఈ వ్యసనానికి మరీ బానిసయ్యాడని తెలిపారు.

క్షీణించిన ఆరోగ్యం
నౌకాదళంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేసిన ప్యూరింటన్ అక్కడి నుంచి బయటకు వచ్చాక చాలా ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా స్థిరంగా లేడు. తరచూ ఉద్యోగాలు మారేవాడని చెబుతున్నారు. తొలుత ఐటీ ఉద్యోగం చేసిన అతడు, గత ఏడాది కాలంలో మద్యం, హార్డ్‌వేర్ దుకాణాల్లో పని చేశాడు. ఒక పిజా పార్లర్‌లో పాత్రలు కూడా కడిగాడని తెలిపారు. కొన్నిసార్లు ఉదయాన్నే పీకలదాకా తాగేవాడని తెలిపారు. శారీరకంగా, మానసికంగా అతడి పరిస్థితి క్షీణించిందని చెబుతున్నారు.

జాత్యాహంకారం గురించి మాట్లాడగా వినలేదు
ఆడమ్ ప్యూరింటన్ పక్షులను వేటాడేందుకు షాట్‌గన్స్‌ను ఉపయోగించేవాడని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన రిపబ్లికన్ పార్టీలో అతడు నమోదయ్యాడని చెప్పారు. అయితే ట్రంప్ గురించి కానీ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా గురించి కానీ, వర్ణవివక్ష గురించి కానీ అతడు మాట్లాడటాన్ని ఎప్పుడూ వినలేదంటున్నారు.

తల్లితో తెగతెంపులు
మరోవైపు, ఆడమ్ ప్యూరింటన్ తమతో తెగతెంపులు చేసుకున్నాడని అతడి తల్లి మార్షా తెలిపారు. కాగా, కాన్సాస్ కాల్పులు జరిగిన గంటల్లోనే ప్యూరింటన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

తెరుచుకున్న బార్
ఆడమ్ ప్యూరింటన్ ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లో కాల్పులు జరిపి శ్రీనివాస్ కూచిభోట్ల ప్రాణాలను బలిగొన్నాడు. ఆ తర్వాత ఈ బార్‌ను మూసివేశారు. అనంతరం తెరుచుకుంది. పోలీసు పహారా మధ్య మళ్లీ తెరుచుకుంది. భోజనానికి వచ్చిన అతిథులు, బార్ ఉద్యోగులు ఉద్వేగానికి లోనయ్యారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.

ఉద్వేగం
ఆడమ్ ప్యూరింటన్ కాల్పులకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌కు నివాళలర్పిస్తూ మెయిన్ డోర్ వద్ద సానుభూతిపరుల పుష్ప గుచ్ఛాలు ఉంచుతున్నారు. తమ బార్ ముప్పై ఏళ్లుగా ఆదరణ సంపాదించుకుందని ఆస్టిన్స్ యజమానుల్లో ఒకరైన బ్రాండన్ బ్లమ్ ఉద్వేగంగా చెప్పారు. ప్యూరింటన్ దాడితో అందరూ దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications